Telugu Global
CRIME

సూర్యాపేట నిందితులు హ‌త‌మ‌య్యారిలా...

మొన్న రాత్రి సూర్యాపేట బ‌స్టాండ్‌లో త‌నిఖీల సంద‌ర్భంగా ఈ ఇద్ద‌రు నిందితులు పోలీసుల‌పై కాల్పులు జ‌రిపారు. కానిస్టేబుల్‌ను, హోంగార్డును చంపేశారు. మరో ఇన్‌స్పెక్ట‌ర్ మొగిల‌య్య‌ను, కానిస్టేబుల్‌ను గాయ‌ప‌ర్చారు. అప్ప‌టి నుంచి ఆ నిందితుల కోసం పోలీసులు గాలింపు చేప‌ట్టారు. 17బృందాలు ఈ ఇద్ద‌రి కోసం సెర్చ్ చేశాయి. మొన్న రాత్రి నుంచి వీరు అక్క‌డికి ద‌గ్గ‌ర‌ల్లోని గుట్ట‌ల్లో ఉన్నారు. ఈ ఉద‌యం న‌ల్గొండ జిల్లా సీతారంపురంలో వీరిద్ద‌రూ క‌నిపించారు. ఆ స‌మ‌యంలోనూ పోలీసుల‌కూ, నిందితుల‌కు మ‌ధ్య కాల్పులు […]

మొన్న రాత్రి సూర్యాపేట బ‌స్టాండ్‌లో త‌నిఖీల సంద‌ర్భంగా ఈ ఇద్ద‌రు నిందితులు పోలీసుల‌పై కాల్పులు జ‌రిపారు. కానిస్టేబుల్‌ను, హోంగార్డును చంపేశారు. మరో ఇన్‌స్పెక్ట‌ర్ మొగిల‌య్య‌ను, కానిస్టేబుల్‌ను గాయ‌ప‌ర్చారు. అప్ప‌టి నుంచి ఆ నిందితుల కోసం పోలీసులు గాలింపు చేప‌ట్టారు. 17బృందాలు ఈ ఇద్ద‌రి కోసం సెర్చ్ చేశాయి. మొన్న రాత్రి నుంచి వీరు అక్క‌డికి ద‌గ్గ‌ర‌ల్లోని గుట్ట‌ల్లో ఉన్నారు. ఈ ఉద‌యం న‌ల్గొండ జిల్లా సీతారంపురంలో వీరిద్ద‌రూ క‌నిపించారు. ఆ స‌మ‌యంలోనూ పోలీసుల‌కూ, నిందితుల‌కు మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. అక్క‌డి నుంచి వారు త‌ప్పించుకున్నారు. మ‌ధ్య‌లో లింగ‌మ‌ల్లు అనే వ్య‌క్తిని భ‌య‌పెట్టి బైక్ లాక్కున్నారు. అక్క‌డి నుంచి డి.కొత్త‌ప‌ల్లి అటు నుంచి జాన‌కీపురం ప‌రార‌య్యారు. ఎట్ట‌కేల‌కు జాన‌కీపురంలో పోలీసులు చుట్టుముట్ట‌డంతో నిందితులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ కాల్పుల్లోనే కానిస్టేబుల్ నాగ‌రాజు స్పాట్లో చ‌నిపోయారు. ఎస్పై సిద్ధ‌య్య, సీఐ బాల‌గంగిరెడ్డి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా ఎస్సై సిద్ధ‌య్య చ‌నిపోయారు.
First Published:  3 April 2015 11:36 PM GMT
Next Story