Telugu Global
Cinema & Entertainment

చిత్రం కాదు నిజమ్ రివ్యూ

చిత్రం కాదు నిజమ్ రివ్యూ: నటీనటులు: అంతా కొత్తవారే.. తెలుసుకోవాల్సిన అవసరం లేదు.. దర్శకత్వం: శైలేంద్రబాబు విడుదల: ఏప్రిల్ 3, 2015 రేటింగ్: అప్రస్తుతం హారర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతున్న సమయంలో కర్ణాటకలోని మంగళూరులో జరిగిన వాస్తవకథ అంటూ ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించింది 'చిత్రం కాదు నిజమ్' సినిమా.

Chitram Kadu Nijam Movie
X

నటీనటులు: అంతా కొత్తవారే.. తెలుసుకోవాల్సిన అవసరం లేదు..

దర్శకత్వం: శైలేంద్రబాబు

విడుదల: ఏప్రిల్ 3, 2015

రేటింగ్: అప్రస్తుతం

హారర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతున్న సమయంలో కర్ణాటకలోని మంగళూరులో జరిగిన వాస్తవకథ అంటూ ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించింది 'చిత్రం కాదు నిజమ్' సినిమా.కన్నడ చిత్రంగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుని తెలుగులోకి డబ్ విడుదలైన ఈ చిత్రంఆడియెన్స్ ను ఏ రేంజ్ లో సంతృప్తి పరిచిందో తెలుసుకునే ముందు కథలోకి వెళ్దాం.

కథేంటి?

మంగళూరుకు సమీపంలో దట్టమైన అడవిలో ట్రెకింగ్ (పర్వతాలు, గుట్టలు ఎక్కడ) కోసం ఆరుగురు స్నేహితులు బయలుదేరుతారు. అడవిలోకి ట్రెకింగ్ వెళ్లిన ఆరుగురికి ఏమైంది? వారికి ఎదురైన అనుభవాలేంటి అనే అంశాలే ఈ చిత్ర కథ.

విశ్లేషణ: ఈ చిత్రంలో నటించిన వారందరూ తెలుగు తెరకు కొత్తవారే. కథానుపరంగా,సన్నివేశాలకు అనుగుణంగా కెమెరా ముందు తమకు తోచింది తోచినట్లుగా వారందరూ బిహేవ్ చేశారు. కొంత మేరకు ప్రేక్షకులను సంతృప్తి పరిచారు కూడా.

ఇక సాంకేతిక విభాగాల్లో అత్యంత ప్రధానంగా ఈ చిత్రంలో చెప్పుకోవాల్సింది కెమెరా వర్క్ గురించి. హారర్ చిత్రానికి సరిపడే సరుకు అడవి, చెట్లు, పుట్టలు..చీకటి ఇలాంటి నేపథ్యాలను చక్కగా కెమెరాలో బంధించారు. నేచురల్ లైట్ ను ఉపయోగించుకుంటూ, పెద్దగా ఆర్టిఫిషియల్ లైటింగ్ వాడకుండా.. కేవలం కెమెరా లైటింగ్ తోనే పనికానిచ్చారు. అదే అంశం ఫీల్ ను పెంచింది.

ఈ చిత్రం ట్రెకింగ్ వెళ్లిన ఆరుగురిలో ఓ వ్యక్తి షూట్ చేసిన ఫుటేజ్ ఆధారంగా "చిత్రం కాదు నిజం' తెరరూపం కల్పించారు. వాస్తవ సంఘటనల్ని చూపిస్తున్నమంటూ ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం కొంత సఫలమైంది. సినిమా చూస్తున్న సేపు వాస్తవ సంఘటనలు అని ఎక్కడా అనిపించవు. అంతా సినిమాటిక్ గానే కనిపిస్తాయి. దెయ్యం వెంటాడుతుంటూ కెమెరా పట్టుకొని షూట్ చేయడమనేది సహజత్వానికి దూరం. వాస్తవ సంఘటన లేదా సినిమా కోసం షూట్ చేశారా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఓవరాల్ గా ఓ చిన్న చిత్రంగా వచ్చిన ఈ చిత్రం ఇటీవల ప్రచార ఆర్భాటం, భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రాల కంటే కాస్తా మెరుగ్గానే సంతృప్తినిస్తుందని మాత్రం గ్యారెంటీగా చెప్పవచ్చు. ఇంట్లో ఏమి తోచక.. సినిమా చూడాల్సిన అవసరం తప్పనిసరైన పరిస్థితుల్లో.. సరదాగా ఏసీలో స్నేహితులతో కాలక్షేపం చేస్తూ సినిమా చూశామనే తృప్తిని మిగిల్చుకోవడానికి కేరాఫ్ అడ్రస్ 'చిత్రం కాదు నిజం'.

First Published:  5 April 2015 3:28 AM GMT
Next Story