Telugu Global
NEWS

ఆసరా పింఛన్ల పంపిణీపై విచారణ.. అధికారి నిర్బంధం

ఆసరా పింఛన్ల పంపిణీలో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్న హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకటేశ్వరరావును మెద‌క్‌జిల్లాలోని గ్రామస్తులు నిర్బంధించారు. ఈ సంఘటన జిల్లాలోని కల్హేరు మండలం కృష్ణాపురంలో జరిగింది. పింఛన్ల పంపిణీలో జరిగిన అవకతవక‌లపై అధికారి విచారణ చేపట్టారు. దీనిపై కాంగ్రెస్‌, టీడీపీ కార్యకర్తలు వారితో ఘర్షణకు దిగారు. విచారణ అనంతరం వెంకటేశ్వరరావు కాగితాలను తీసుకువెళ్తుండగా.. వాటిని లాక్కొని చింపివేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ పీడీని గ్రామస్తులు నిర్బంధించారు.-పీఆర్‌

First Published:  5 April 2015 1:33 AM GMT
Next Story