Telugu Global
National

త‌ప్పుడు భావ‌న‌తోనే సీసీ కెమెరాల ఏర్పాటు

ఫ్యాబ్‌ఇండియా వస్త్ర దుకాణం ట్రైల్‌ రూంలో యాజ‌మాన్యం ఉద్దేశపూర్వకంగానే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసింద‌ని త‌మ దృష్టికి వ‌చ్చిన‌ట్టు గోవా పోలీసులు తెలిపారు. ఫ్యాబ్ ఇండియా వారు ప్లాన్‌లో సూచించిన ప్రకారం కెమెరాలు ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. ఫ్యాబ్ ఇండియా వస్త్రదుకాణానికి వెళ్లిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. అక్కడ దుస్తులు మార్చుకునే గదిలో కెమెరాల ఏర్పాటుపై ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ కేసులో ఫ్యాబ్‌ ఇండియా ఉద్యోగులు కొంత‌మందిని అరెస్ట్ చేసి విచార‌ణ జ‌రిపారు. […]

ఫ్యాబ్‌ఇండియా వస్త్ర దుకాణం ట్రైల్‌ రూంలో యాజ‌మాన్యం ఉద్దేశపూర్వకంగానే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసింద‌ని త‌మ దృష్టికి వ‌చ్చిన‌ట్టు గోవా పోలీసులు తెలిపారు. ఫ్యాబ్ ఇండియా వారు ప్లాన్‌లో సూచించిన ప్రకారం కెమెరాలు ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. ఫ్యాబ్ ఇండియా వస్త్రదుకాణానికి వెళ్లిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. అక్కడ దుస్తులు మార్చుకునే గదిలో కెమెరాల ఏర్పాటుపై ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ కేసులో ఫ్యాబ్‌ ఇండియా ఉద్యోగులు కొంత‌మందిని అరెస్ట్ చేసి విచార‌ణ జ‌రిపారు. వీరు చెప్పిన దాని ప్ర‌కారం ప్యాబ్ ఇండియా యాజ‌మాన్యం కావాల‌నే సీసీ కెమెరాల‌ను ట్ర‌యిల్ రూమ్‌లో ఏర్పాటు చేసింద‌ని చెప్పారు. అరెస్ట్ చేసిన ఉద్యోగులలు బెయిల్‌పై విడుదలయ్యారు. వారిని పోలీసు కస్టడీకి ఎందుకు తీసుకోదన్న విమర్శలపై పోలీసులు స్పందిస్తూ కావ‌ల‌సిన స‌మాచారం ల‌భించినందున ఆ అవసరం రాలేదని చెప్పారు.-పీఆర్‌
First Published:  6 April 2015 3:11 AM GMT
Next Story