ఏపీ అధికారులపై ఉగ్ర నరసింహుడు!

ఎక్క‌డైనా ఇంటి ఓన‌ర్లే ఆస్తి పన్ను చెల్లిస్తారు… కాని తెలంగాణ‌లో మాత్రం కిరాయిదారులే చెల్లించాల‌ని గ‌వ‌ర్న‌ర్ సారు హుకుం జారీ చేశారు. ఆస్తి పన్ను చెల్లించకపోతే కిరాయిదారులను ఇళ్లల్లోంచి ఖాళీ చేయించాలా… అంటే ‘ఔను’ అనే అంటున్నారు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌! హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన ప్రభుత్వ కార్యాలయాలకు ఆస్తి పన్ను నోటీసు ఇచ్చారు. దీంతో ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రోడ్లు భవనాల శాఖ అధికారుల బృందం ఈ మధ్యనే గవర్నర్‌ నరసింహన్‌ను కలిసింది. ఆస్తి పన్నును యజమాని చెల్లించాల్సి ఉంటుందని.. తాము తాత్కాలిక ప్రాతిపదికన ఆ భవనాల్లో ఉంటున్నందున కిరాయిదారులమే అవుతామని అధికారులు ఆయనకు వివరించారు. అంతే… గవర్నర్‌ ఒక్కసారిగా ఉగ్ర నరసింహుడై పోయారు. ‘‘తెలంగాణ ప్రభుత్వానికి మొత్తం పన్ను కట్టేయండి. లేకపోతే ఏపీ ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేయిస్తాను’’ అని తీవ్ర స్వరంతో హెచ్చరించినట్టు సమాచారం. ఏపీ ప్రభుత్వ అధికారులు తన వద్దకు వచ్చి, రూల్స్‌ను కూడా వివరించి, జోక్యం చేసుకోవాలని కోరితే ఏకంగా అన్ని ఆఫీసులనూ ఖాళీ చేయిస్తానని హెచ్చరించడంతో వారంతా అవాక్కయ్యారు. గ‌వ‌ర్న‌ర్‌కేంటో ఈ మ‌ధ్య తెలంగాణ ప్ర‌భుత్వం తెగ న‌చ్చేస్తుంది…పీఆర్‌