Telugu Global
NEWS

సూర్యాపేట‌ ఉగ్ర‌వాదుల త‌ల‌పై అసంఖ్యాక కేసులు!

అర్వపల్లి పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సిమి ఉగ్రవాదులు మహ్మద్‌ ఎజాజుద్దీన్‌, మహ్మద్‌ అస్లంతోపాటు వారి గ్యాంగ్‌ సభ్యులైన అబూ ఫైజల్‌, అంజద్‌, మహబూబ్‌, జాకీర్‌, ఇక్రార్‌ షేక్‌ ఇతర సభ్యుల నేరచరిత్ర చూస్తే  ఎవ‌రికైనా దిమ్మ తిరిగిపోతుంది. అస‌లు వీళ్ళు తీవ్ర‌వాదులు కానే కాద‌ని, దోపిడీ దొంగ‌లు మాత్ర‌మేన‌ని తెలంగాణ పోలీస్ బాస్ చెప్పిందే చెపి న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు కాని కుద‌ర‌లేదు. చివ‌రికి ఆయ‌నే ఉగ్ర‌వాదుల‌ని ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. హ‌తులైన ఇద్ద‌రిదీ కూడా నేర […]

అర్వపల్లి పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సిమి ఉగ్రవాదులు మహ్మద్‌ ఎజాజుద్దీన్‌, మహ్మద్‌ అస్లంతోపాటు వారి గ్యాంగ్‌ సభ్యులైన అబూ ఫైజల్‌, అంజద్‌, మహబూబ్‌, జాకీర్‌, ఇక్రార్‌ షేక్‌ ఇతర సభ్యుల నేరచరిత్ర చూస్తే ఎవ‌రికైనా దిమ్మ తిరిగిపోతుంది. అస‌లు వీళ్ళు తీవ్ర‌వాదులు కానే కాద‌ని, దోపిడీ దొంగ‌లు మాత్ర‌మేన‌ని తెలంగాణ పోలీస్ బాస్ చెప్పిందే చెపి న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు కాని కుద‌ర‌లేదు. చివ‌రికి ఆయ‌నే ఉగ్ర‌వాదుల‌ని ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. హ‌తులైన ఇద్ద‌రిదీ కూడా నేర చ‌రిత్ర చూస్తే అవునా అనిపించే నిజాలు మ‌న క‌ళ్ళ‌ముందు సాక్ష్యాత్కార‌మ‌వుతాయి. 2009లో బీజేపీ నేత ప్రమోద్‌పై కాల్పులు జ‌రిపిన కేసులు నిందితులు. అలాగే కాండ్వాలోని ఎమిలీపురలో వ్యాపారిని బెదిరించి రూ.60 వేల దోపిడీ, దేవాస్‌ బ్యాంకులో రూ.లక్షా 25 వేల చోరీ, విజయముడిలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.9.50 లక్షల చోరీ, ఎంపీలోని సట్నా జైల్లో జైలర్‌ హత్యకు కుట్ర, కాంఢ్వాలో కానిస్టేబుల్‌ సీతారామ్‌ యాద్‌ హత్య కేసుల్లో వీరు నిందితులు. అలాగే 2010లో మధ్యప్రదేశ్‌ ఇట్రాసీలో కెనరా బ్యాంకు నుంచి రూ.80 వేల చోరీ. రట్లమ్‌ జిల్లాలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో లక్ష రూపాయల దొంగతనం. ఇండోర్‌ ఎస్‌బీఐలో లక్ష, మణప్పురం గోల్డ్‌ ఫైనాన్స్‌లో పది కిలోల బంగారం దోపిడీ. ఎంపీలోని ఉజ్జయిని స్థానిక కోర్టు జడ్జి భేరూలాల్‌ టక్‌పై కాల్పుల ఘ‌ట‌న‌ల్లోనూ వీరున్నారు. 2013… ఒడిశాలోని గ్రామీణ బ్యాంకులో రూ.1.25 లక్షల చోరీ కేసులోని ఆ త‌ర్వాత సంవ‌త్సంర జ‌రిగిన కరీంనగర్‌ చొప్పదండిలో ఎస్‌బీఐ బ్యాంకులో 46 లక్షల చో రీ కేసులోను, చెన్నై రైల్వే స్టేషన్‌లో బెంగళూరు- గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు సంఘ‌ట‌న‌లోను, పుణెలో పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా, బిజనొర్‌లో బాంబు పేలుళ్ళ కేసుల్లోను, మెదక్‌ జిల్లా రామ‌చంద్రాపురంలో 3.2 కేజీల బంగారం, 22.5 లక్షల నగదు దొంగతనం కేసుల్లో వీరు నిందితులు. ఈ సంవ‌త్స‌రం ఒడిశాలోని అలెప్పీ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ కేసులోను, లఖ్‌నవ్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో దోపిడీ కేసుల్లోను కూడా వీరు నిందితులుగా ఉన్న‌ట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇన్ని కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిని పోలీస్ బాసులు ఆషామాషీగా ఎలా ప‌రిగ‌ణించార‌న్న‌ది అంతుబట్ట‌ని ప్ర‌శ్న‌! -పీఆర్‌
First Published:  6 April 2015 2:30 AM GMT
Next Story