Telugu Global
NEWS

కాంట్రాక్టు సిబ్బందిని తొల‌గించం:ఏపీ సీఎం

ఉద్యోగుల‌ను ఎలాంటి ఇబ్బందుల‌కు గురి చేయ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతోనే త‌మ ప్ర‌భుత్వం ఉంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అన్నారు.  తిరుప‌తి బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల‌ను తొల‌గించేది లేద‌ని హామీ ఇచ్చారు. ఆర్థికంగా రాష్ట్రం క‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌టికీ ఉద్యోగుల‌కు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామ‌ని, తెలంగాణ ముందుగానే 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి త‌మ‌ను ఇర‌కాటంలో పెట్టాల‌ని చూసింద‌ని, ఆర్థికంగా బ‌లంగా లేక‌పోయినా స‌వాలుగా తీసుకుని 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వ‌గ‌లిగామ‌ని ఆయ‌న […]

కాంట్రాక్టు సిబ్బందిని తొల‌గించం:ఏపీ సీఎం
X
ఉద్యోగుల‌ను ఎలాంటి ఇబ్బందుల‌కు గురి చేయ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతోనే త‌మ ప్ర‌భుత్వం ఉంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అన్నారు. తిరుప‌తి బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల‌ను తొల‌గించేది లేద‌ని హామీ ఇచ్చారు. ఆర్థికంగా రాష్ట్రం క‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌టికీ ఉద్యోగుల‌కు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామ‌ని, తెలంగాణ ముందుగానే 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి త‌మ‌ను ఇర‌కాటంలో పెట్టాల‌ని చూసింద‌ని, ఆర్థికంగా బ‌లంగా లేక‌పోయినా స‌వాలుగా తీసుకుని 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వ‌గ‌లిగామ‌ని ఆయ‌న తెలిపారు. ఆర్థికంగా క‌ష్టాల్లో ఉన్నా ఉద్యోగుల‌ వ‌య‌సును 58 నుంచి 60 సంవ‌త్స‌రాల‌కు పెంచామ‌ని, తాము ఉద్యోగుల ప‌క్షంగా ఉంటామ‌నే విష‌యం గుర్తించాల‌ని బాబు అన్నారు. డ‌బ్బుల్లేని స‌మ‌యంలోనే ఇన్ని నెర‌వేర్చామ‌ని, అవ‌స‌ర‌మైతే ఒక‌టి రెండు గంట‌లు ఎక్కువ‌గా ప‌ని చేసి అయినా రాష్ట్రం ఆర్థికంగా నిల‌బెట్టాల్సిన బాధ్య‌త ఉద్యోగుల‌పై ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఉద్యోగుల్లో సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డానికి తాము సుముఖంగా ఉన్నామ‌ని, ట్రాన్స‌ఫ‌రెన్సీని కూడా ఉద్యోగులు కోరుకుంటున్నార‌ని ఏపీ ఎన్‌జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. తాము రాష్ట్ర ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప‌ని చేస్తామ‌ని, ఆర్థికంగా నిల‌దొక్కుకోవ‌డానికి త‌మ వంతు స‌హ‌కారం అందిస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు.-పీఆర్‌
First Published:  6 April 2015 1:18 PM GMT
Next Story