స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ల‌క్ష్యం అదేనా..!

కొడితె సిక్స్ కొట్టాలి. ఆడితె ర‌ఫ్ ఆడాలి. ఇదే ఇప్ప‌టి క‌మ‌ర్షియల్ చిత్రాల టార్గెట్‌. ఎన్ని సినిమాలు చేశాం ..ఎంత మంచి చిత్రాలు చేశాం అనే
దానికంటే.. ఎంత క‌లెక్ట్ చేసింది అనేది మెయిన్ పాయింట్ అయ్యింది. ఒక మాదిరి హీరోలు చేస్తేనే భారీ అంచ‌నాలుంటాయి. ఇక అల్రేడి రేసు గుర్రం చిత్రంతో హీరో అల్లు అర్జున్..అత్తారింటికి దారేది సినిమాతో డైరెక్టర్ త్రివిక్ర‌మ్ బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే.
దీంతో స‌న్నాఫ్ సత్య‌మూర్తి చిత్రం పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ సీనియర్ ఆర్టిస్ట్ లకు .. గ‌తంలో బ‌న్నీ తో చేసిన జులాయి చిత్రానికంటే.. స‌న్నాఫ్
స‌త్య‌మూర్తి వ్యాపార ప‌రంగా బాగా చేయాల‌ని చెప్ప‌డం జ‌రిగింది. ఈ విష‌యాన్ని స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ఆడియో విడుద‌ల రోజున ఈ చిత్రంలో ఒక కీ రోల్ పోషించిన రాజేంద్ర ప్ర‌సాదే స్వ‌యంగా చెప్పారు. క్యాస్టింగ్ ప‌రంగా స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ఒక విశేషం అయ్యింది. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, మొన్న‌టి వ‌ర‌కు హీరోయిన్ గా చేసిన స్నేహా, న‌ట కీరిటి రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించారు.

ఇక స‌మంత‌, ఆదాశ‌ర్మ‌, నిత్యామీన‌న్ వంటి ముగ్గురు బ్యూటీఫుల్ హీరోయిన్స్ బ‌న్నీ స‌ర‌స‌న న‌టించారు. సినిమా ప్ర‌చార చిత్రాలు చూస్తుంటే.. హీరోకి వున్న యాక్ష‌న్ ఇమేజ్ ను మిస్ కానివ్వ‌కుండానే.. స‌కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గిన‌ట్లు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిని డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ చేసిన‌ట్లు స్ప‌ష్టం అవుతుంది. ఇక దేవి శ్రీ ప్ర‌సాద్ ఇచ్చిన సంగీతం సినిమా స‌క్సెస్ కు ఒక పిల్ల‌ర్ గా నిలుస్తుంద‌నే స్థాయిలో ఉంది. సో ఇదంతా స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి తో బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ లో ది బెస్ట్ గా నిల‌పాలనే ప్ర‌ణాళిక చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లు అనిపిస్తుంది . ఎనీ వే భారీ అంచ‌నాలతో గురువారం విడుద‌లకు సిద్ద‌మైన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ఘ‌న విజ‌యం సాధించాలని కోరుకుందాం.
===