స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ప్రివ్యూ

తెలుగు ప్రేక్ష‌క లోకం స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తుంది అన‌డంలో సందేహాం లేదు. ఇంకొన్ని గంట‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినిమా అభిమానుల్ని స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ప‌ల‌క‌రించ‌నున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స‌మంత‌, ఆదాశ‌ర్మ‌,నిత్యామీన‌న్ లీడ్ రోల్స్ తో సిద్దం అయిన ఈ చిత్రం స్టోరి ఏమిటి అనేది ఇప్పుడు అభిమానుల్లో న‌డుస్తున్న చ‌ర్చ‌. ప్ర‌చార చిత్రాలు.. ఆడియో విడుదల రోజు రాజేంద్ర ప్ర‌సాద్ గారు చెప్పిన మాట‌ల్ని ఆధారం చేసుకుని ఎక్కువ మంది స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ఒక ఆరోగ్య క‌ర‌మైన స్వ‌గృహ ఫ్యామిలీ ఫుడ్ లాంటి సినిమా అని అంచ‌నాలు వే్స్తున్నారు. ఇదే విష‌యాన్ని అల్లు అర‌వింద్ గారు ఆడియో విడుద‌ల రోజు చెప్పారు. ప్ర‌చార చిత్రాలు కూడా స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి స‌కుటుంబ స‌మేతంగా చూడ‌త‌గ్గ ఫ్యామిలీ ఎంటర్ టైన‌ర్ విత్ సెంటిమెంట్ అనే విధంగా వున్నాయి. ఎక్కువ మంది సినిమా విమ‌ర్శ‌కులు. బ‌న్నీ ఫ్యాన్స్ మ్యాగ్జిమ‌మ్ స‌న్నాప్ స‌త్య‌మూర్తి ..అత్తారింటికి దారేది త‌ర‌హాలోనే మంచి విందు భోజ‌నం లాంటి సినిమా అని గెస్ చేస్తున్నారు. మా గెస్ కూడా అదే మ‌రి.! మీది అదేనా..!