Telugu Global
Cinema & Entertainment

ప‌వ‌న్ అప్పుడే చెబితే..బ‌న్నీకి ఇప్పుడు అర్ధం అయ్యింది 

కొన్ని విష‌యాలు సంద‌ర్భం, వ‌య‌సు  ..అనుభ‌వం పెరిగితేనే అర్ధం అవుతాయంటారు పెద్ద‌లు.  బ‌న్ని విష‌యంలో  ప‌వ‌న్ క‌ళ్యాణ్   పుష్క‌ర కాలం క్రితం చెప్పిన విష‌యం ఇప్ప‌టికి అర్ధం అయ్యింద‌ట‌.  ఈ రోజు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి   సినిమా రిలీజ్ సంద‌ర్భంగా  మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వూలో ప‌లు విశేషాలు  తెలిపాడు. వాటిల్లో  ఈ విష‌యం కూడా పంచుకున్నారు. ఇంత‌కి ఆ విష‌యం ఏమిటంటే.. ఖుషి సినిమా విడుద‌ల‌యిన త‌రువాత  బ‌న్నీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌ల‌సి..  ఇన్ని స‌క్సెస్ లు..  […]

ప‌వ‌న్ అప్పుడే చెబితే..బ‌న్నీకి ఇప్పుడు అర్ధం అయ్యింది 
X

కొన్ని విష‌యాలు సంద‌ర్భం, వ‌య‌సు ..అనుభ‌వం పెరిగితేనే అర్ధం అవుతాయంటారు పెద్ద‌లు. బ‌న్ని విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుష్క‌ర కాలం క్రితం చెప్పిన విష‌యం ఇప్ప‌టికి అర్ధం అయ్యింద‌ట‌. ఈ రోజు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమా రిలీజ్ సంద‌ర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వూలో ప‌లు విశేషాలు తెలిపాడు. వాటిల్లో ఈ విష‌యం కూడా పంచుకున్నారు. ఇంత‌కి ఆ విష‌యం ఏమిటంటే.. ఖుషి సినిమా విడుద‌ల‌యిన త‌రువాత బ‌న్నీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌ల‌సి.. ఇన్ని స‌క్సెస్ లు.. ఎలా హ్యండిల్ చేయ‌గ‌లుగుతున్నారు..? క‌థ‌లు ఎలా ఎంచుకుంటారు అనిఅడిగాడ‌ట‌.

ప‌వ‌న్ కూల్ గా నీవ్వెంటో అదే నీ సినిమా అని ఒకే ముక్క‌లో స‌మాధానం చెప్పేశాడ‌ట‌. ప‌వ‌న్ చెప్పిన ఆ స‌ మాధానం బ‌న్నీ కి అప్ప‌ట్లో అస‌లు ఏమి అర్ధం కాలేద‌ట‌. క‌ట్ చేస్తే.. ప‌వ‌న్ చెప్పిన ఆ మాట‌కు అర్ధం స‌న్నాఫ్స‌త్యమూర్తి చిత్రంతో అనుభ‌వంలోకి వ‌చ్చింద‌ట‌. కొన్ని క‌థ‌ల‌కు త్వ‌ర‌గా క‌నెక్ట్ కావ‌డానికి కార‌ణం.. ఆ క‌థ‌లో మ‌న వ్య‌క్తిత్వానికి సంబంధించిన అంశాలు ఎక్కువుగా ఉండ‌ట‌మే అనే విష‌యం బోధ ప‌డింద‌ట‌. త‌ను చేసిన ఆర్యా,ప్ర‌స్తుతం చేసిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల్లో బ‌న్ని క్యారెక్ట‌రైజేష‌న్స్ రెండు త‌న మ‌న‌సుకు తొంభై శాతం ద‌గ్గ‌రైన‌వేన‌ట‌. అందుకే ఈ రెండు క‌థ‌ల‌కు త్వ‌ర‌గా కనెక్ట్ అయ్యాడ‌ట‌. ఆర్యా సినిమాలో బ‌న్ని క్యారెక్ట‌రైజేష‌న్ ..అత‌ని రియ‌ల్ లైఫ్ కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. ఇక తండ్రి , కొడుకుల మ‌ధ్య అనుబంధం హైలైట్‌ చేసిన స‌న్నాఫ్ ఏ రేంజ్ హిట్కొడుతుందో ఈవారం ఎండింగ్ కు తెలిసిపోతుంది మ‌రి.!

First Published:  9 April 2015 6:46 AM GMT
Next Story