ప్రియుడిని విడ‌వ‌లేదట‌..!

బాలీవుడ్ హాట్ క‌పుల్ అంటే ఎవ‌రైన ట‌క్కున దీపిక ప‌దుకోణ్‌, ర‌ణ్వీర్ సింగ్ పేరులే చెబుతారు. ఈ మ‌ధ్య ర‌ణ్వీర్ సింగ్ న‌టిస్తున్న బాజీరావ్ మస్తాన్ చిత్ర షూటింగ్ స‌మ‌యంలో అత‌ని భుజానికి గాయ‌మై శ‌స్త్ర చికిత్స‌కు ఓ ప్రైవైటు ఆసుప‌త్రి లో చేరిన విష‌యం తెలిసిందే. అత‌ని ఆరోగ్యం గురించి..ఎప్పటిక‌ప్పుడు అభిమానుల‌కు ర‌ణ్వీర్ సింగ్ ట్విట్ చేస్తూ తెలియ చేశాడు. అయితే అదే రోజు త‌న తో పాటు ..త‌న గాళ్ ఫ్రెండ్ దీపిక ప‌దుకోణ్ కూడా ర‌ణ్వీర్ తో ఉంద‌ని బాలీవుడ్ మీడియా స‌మాచారం. ఆ విషయాన్ని మాత్రం అటు ర‌ణ్వీర్ గానీ..ఇటు దీపిక గాని మీడియాకు తెలియ చేయ‌లేదు. గ‌తంలో కూడా ర‌ణ‌వీర్ సింగ్ డెంగ్యూ జ‌బ్బు తో బాధ‌ప‌డుతూ ఆసుప‌త్రిలో చేరితే దీపిక అత‌నితో ఉండి స‌ప‌ర్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.