Telugu Global
Cinema & Entertainment

స‌న్నాఫ్ కు దేవిశ్రీ ఒక పిల్ల‌ర్ అయిన‌ట్లే..

ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. సినిమా కొన్ని చోట్ల ఉద‌యం 6 గంట‌ల నుంచే ప్రారంభించారు. సినిమా కు దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం అత‌ని కెరీర్ లో ఒక బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుంది అనే అంటున్నారు. ఇప్ప‌టికే సినిమా గురించి బెనిఫిట్ షో ల రివ్యూస్ వ‌చ్చాయి. లైఫ్ అప్ డేట్స్ కొన్ని వెబ్ సైట్స్ అందించాయి. అన్ని రివ్యూస్ లోను […]

స‌న్నాఫ్ కు దేవిశ్రీ ఒక పిల్ల‌ర్ అయిన‌ట్లే..
X

ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. సినిమా కొన్ని చోట్ల ఉద‌యం 6 గంట‌ల నుంచే ప్రారంభించారు. సినిమా కు దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం అత‌ని కెరీర్ లో ఒక బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుంది అనే అంటున్నారు. ఇప్ప‌టికే సినిమా గురించి బెనిఫిట్ షో ల రివ్యూస్ వ‌చ్చాయి. లైఫ్ అప్ డేట్స్ కొన్ని వెబ్ సైట్స్ అందించాయి. అన్ని రివ్యూస్ లోను దేవిశ్రీ సంగీతానికి ఎక్కువ మార్కులు ప‌డ్డాయి. సినిమా అత్తారింటికి దారేది త‌ర‌హాలోనే వినోదం, ఫ్యామిలి ఎలిమెంట్స్ ఎక్కువ పాళ్ల‌లో పెట్టి.. మ‌ధ్య మ‌ధ్య లో యాక్ష‌న్ స‌న్నివేశాల్ని పెట్టి ఓవ‌రాల్ గా డైరెక్టర్ త్రివిక్ర‌మ్ అభిమానులు ఆశించిన దానికంటే ఎక్కువ అవుట్ పుట్ ఇచ్చిన‌ట్లే అనేది విమ‌ర్శ‌కులు తేల్చిన మాట . మ‌రి ఆడియ‌న్స్ తీర్పు ఏమిటి అనేది ఈ రోజు ఈవెనింగ్ కు ఒక క్లారీటి వ‌స్తుంది. క్రిటిక్స్ కంటే.. ఆడియ‌న్స్ తీర్పే ఫైన‌ల్ అనే విష‌యం డైరెక్ట‌ర్, ప్రొడ్యూస‌ర్ కు ఇంపార్టెంట్ క‌దా.!

First Published:  9 April 2015 12:21 AM GMT
Next Story