Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 39

తప్పదు మరి ‘రాణీ! మనం కొత్తగా పెళ్ళయిన వాళ్ళమని ఇతర్లకి తెలీకూడదు’ ‘సరే! ఆ రెండు సూట్‌కేసులూ మోసుకురండి’. ************ పిల్లి… ఎలుక ‘నాకు కోపం తెప్పించి నాలోని జంతువుని బయటకు రప్పించకు’. అని భర్త ఆగ్రహంతో అరిచాడు. ‘ఐతే ఏమిటి? ఎలుకకు ఎవరు భయపడతారు?’ అంది భార్య. ************ నిజాయితీ కొత్తగా ఆ ఊరికి వచ్చిన ఆ వ్యక్తి ఆ వూళ్ళో ఉన్న వాళ్ళతో ‘ఇక్కడే స్థిరపడి నిజాయితీగా బతుకుదామనుకుంటున్నాను’ అన్నాడు. దానికి ఒకతను ‘తప్పకుండా. […]

తప్పదు మరి

‘రాణీ! మనం కొత్తగా పెళ్ళయిన వాళ్ళమని ఇతర్లకి తెలీకూడదు’

‘సరే! ఆ రెండు సూట్‌కేసులూ మోసుకురండి’.

************
పిల్లి… ఎలుక

‘నాకు కోపం తెప్పించి నాలోని జంతువుని బయటకు రప్పించకు’. అని భర్త ఆగ్రహంతో అరిచాడు. ‘ఐతే ఏమిటి? ఎలుకకు ఎవరు భయపడతారు?’ అంది భార్య.

************
నిజాయితీ

కొత్తగా ఆ ఊరికి వచ్చిన ఆ వ్యక్తి ఆ వూళ్ళో ఉన్న వాళ్ళతో ‘ఇక్కడే స్థిరపడి నిజాయితీగా బతుకుదామనుకుంటున్నాను’ అన్నాడు.

దానికి ఒకతను ‘తప్పకుండా. ఆ విషయంలో మీకెవరూ పోటీరారులెండి’ అన్నాడు.

************
బుర్రలేని బంధువు

‘కృష్ణారావ్‌! అతను నీ బంధువని, కావాలంటే ఆ విషయాన్ని ఆధారాల్తో సహా నిరూపించగలనని అంటున్నాడు. నువ్వేమంటావు?’

‘ఆ మనిషి బుర్రలేనివాడు’

‘అతను నీ బంధువనడానికి ఇంతకన్నా ఆధారం ఏం కావాలి?’

First Published:  9 April 2015 8:00 AM GMT
Next Story