Telugu Global
NEWS

ఎక్సైజ్ మంత్రి జిల్లాలో మద్యం కిక్

ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. ఎమ్మార్పీకి ఎగనామం పెట్టి అధిక రేట్లకు విక్రయాలు సాగిస్తున్నారు. వ్యాపారులంతా సిండికేట్లు దందా నిర్వహిస్తున్నారు. అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ సిబ్బంది మామూళ్ళ మత్తులో మునిగిపోతున్నారు. కృష్ణాజిల్లాలోని సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాకాలోనే ఇలా జరగుతుందంటే ఏ విధంగా మద్యాన్ని విక్రయిస్తూ వాటిని క్యాష్ చేసుకుంటున్నారో అర్థంచేసుకోవచ్చు. బెల్టుషాపుల ఏర్పాటును నిరోధించడంతోపాటు ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు జరుగుతాయని ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. […]

ఎక్సైజ్ మంత్రి జిల్లాలో మద్యం కిక్
X

ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. ఎమ్మార్పీకి ఎగనామం పెట్టి అధిక రేట్లకు విక్రయాలు సాగిస్తున్నారు. వ్యాపారులంతా సిండికేట్లు దందా నిర్వహిస్తున్నారు. అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ సిబ్బంది మామూళ్ళ మత్తులో మునిగిపోతున్నారు. కృష్ణాజిల్లాలోని సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాకాలోనే ఇలా జరగుతుందంటే ఏ విధంగా మద్యాన్ని విక్రయిస్తూ వాటిని క్యాష్ చేసుకుంటున్నారో అర్థంచేసుకోవచ్చు.

బెల్టుషాపుల ఏర్పాటును నిరోధించడంతోపాటు ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు జరుగుతాయని ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంచినీరు దొరకని గ్రామాలున్నాయి. కాని, మద్యం దొరకని గ్రామం మచ్చుకైనా ఒక్కటి లేదంటే అతిశయోక్తి కాదు. వచ్చే ఏడాది నుంచి కొత్త పాలసీ అమలు చేస్తామని ప్రభుత్వం పాట పాడుతోంది. ఆ పాలసీ ఏమిటో ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. మరో మూడు నెలలతో గడువు ముగియనుండడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే అభిప్రాయంతో వ్యాపారులు అడ్డదిడ్డంగా సంపాదించుకుంటున్నారు.

కృష్ణాజిల్లాలో 335 మద్యం షాపులుండగా వాటికి శ్లాబుల ప్రకారం ఫీజు వసూలు చేశారు. ఒకటవ శ్లాబ్ కింద 176 షాపులకు ఒక్కొక్క షాపుకు 32.50 లక్షలు వసూలు చేశారు. రెండో శ్లాబ్ కింద వంద షాపులకు 36 లక్షలు చొప్పున వ్యాపారులు ఫీజు చెల్లించారు. మూడో శ్లాబు 21 షాపులకు ఒక్కొక్కదానికి 45 లక్షలు వసూలు చేశారు. నాలుగో శ్లాబు కింద ఒక్కొక్క షాపుకు 50 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా ఇది జిల్లాల్లో అమలు కాలేదు. అయిదో శ్లాబు కింద 38 షాపులకు ఒక్కొక్క షాపుకు 64 లక్షల ఫీజు వసూలు చేశారు. మొత్తం లైసెన్స్ ఫీజు ద్వారా జిల్లా నుంచి ప్రభుత్వానికి 126.97 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.

కాగా, జిల్లావ్యాప్తంగా మద్యం షాపులలో ఎమ్మార్పీ ధరలు అమలు కావడం లేదు. నిన్నమొన్నటి వరకు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఎమ్మార్పీకే విక్రయాలు జరిగాయి. తాజాగా బందరు పట్టణంలోను అధిక రేట్లు అమల్లోకి వచ్చాయి. లిక్కర్ సీసాకు అయిదు రూపాయల నుంచి పది రూపాయలు, బీరు సీసాకు 10 నుంచి 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. మిగతాచోట్ల విధానం ఎప్నట్నుంచో అమలవుతోంది. ప్రస్తుతం మచిలీపట్నం, రూరల్ ప్రాంతంలో 17 మద్యం షాపులుండగా, అన్నింటా అధిక ధరలేననే మాట వినిపిస్తోంది. కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో సీసాకు అయిదు రూపాయలు వసూలు చేస్తున్నారు. గూడూరు మండలంలో ఎమ్మార్పీకంటే అదనంగా రూ.5 నుంచి 7 రూపాయలు వసూలు చేస్తున్నారు. గుడివాడ ప్రాంతంలో లిక్కర్ దందా మరింత అధికం. ఇదే విధానం జిల్లా అంతటా ఉన్నా ఎక్సైజ్ పోలీసులు మాత్రం కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల అబ్కారీ, ఆదాయ పన్నుల శాఖల నడుమ తలెత్తిన వివాదంతో డిపోలు మూడపడగా, ఇతర రాష్ట్రాల నుంచి కృష్ణాజిల్లాకు మద్యం అక్రమ రవాణా జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిని షాపుల్లో అమ్ముకుంటున్నట్టు తెలియవచ్చింది.

మామూళ్ల మత్తులో జోగుతోన్న ఎక్సైజ్.. రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లాలోనే మద్యం అమ్మకాలు సక్రమంగా జరగడంలేదు. చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు కొందరు నెలవారీ ముడుపులు తీసుకుంటూ నిబంధనలకు పాతరేస్తున్నారు. ఒక్కొక్క షాపు నుంచి కనిష్టంగా రూ.5 వేలు, గరిష్టంగా రూ.20 వేలు పైబడి మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో వేల సంఖ్యలో బెల్టుషాపులు యథేచ్ఛగా పనిచేస్తున్నాయి. వీటిల్లో అధిక భాగం మద్యం షాపులకు అనుబంధంగానే పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్సైజ్ పోలీసులు అప్పుడప్పుడు మొక్కుబడి దాడులు చేస్తూ అరకొర చర్యలతో సరిపెట్టుకుంటున్నారు. బెల్టుషాపుల నిర్వహణ జిల్లాలో యథేచ్ఛగా జరుగుతోందనడానికి కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామం సాక్షిగా ఉంది. ఇక్కడ ప్రజలే బెల్టు షాపు సమాచారాన్ని బహిర్గతం చేసినా పోలీసులు స్పందించకపోవడం ఇందుకు నిదర్శనం. ఇలా ఒకట్రెండు సార్లు కాదు.. చాలాసార్లు గ్రామాస్తులు ముందుకొచ్చినా ఎక్సైజ్ శాఖ వెనకడుగు వేసిందనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఎక్సైజ్ శాఖ ఇకనైనా తమ తీరు మార్చుకొని, విచ్చలవిడి అమ్మకాలు అరికట్టడం ఎంతైనా అవసరం.

First Published:  9 April 2015 6:42 AM GMT
Next Story