Telugu Global
Cinema & Entertainment

ఇకపై విదేశాల్లోనే ఎన్టీఆర్

టెంపర్ తర్వాత నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. సుకుమార్ దర్శకత్వంలో త్వరలోనే ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడా సినిమాకు సంబందించి అఫీషియల్ డేట్స్ కన్ ఫర్మ్ అయ్యాయి. వచ్చేనెల 1 నుంచి లండన్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే అంతకంటే ముందు సుకుమార్ టీం విదేశాలకు ప్రయాణంకట్టింది. ప్రస్తుతం స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో సుక్కూ అండ్ కో ఉంది. అక్కడే ఎన్టీఆర్ నయా మూవీకి […]

ఇకపై విదేశాల్లోనే ఎన్టీఆర్
X

టెంపర్ తర్వాత నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. సుకుమార్ దర్శకత్వంలో త్వరలోనే ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడా సినిమాకు సంబందించి అఫీషియల్ డేట్స్ కన్ ఫర్మ్ అయ్యాయి. వచ్చేనెల 1 నుంచి లండన్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే అంతకంటే ముందు సుకుమార్ టీం విదేశాలకు ప్రయాణంకట్టింది. ప్రస్తుతం స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో సుక్కూ అండ్ కో ఉంది. అక్కడే ఎన్టీఆర్ నయా మూవీకి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. సుక్కూ ఆస్థాన సంగీత దర్శకుడు

దేవిశ్రీప్రసాద్ తో పాటు గీతరచయిత చంద్రబోస్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారు. కనీసం 4 పాటలు పక్కా అనుకున్నతర్వాత సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు.

సుకుమార్-దేవిశ్రీ కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీమ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి ఒక్క వన్-నేనొక్కడినే తప్ప. మరోసారి అలాంటి మిస్టేక్ రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో పాటలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈసారి సుక్కూ-ఎన్టీఆర్ కోసం అదిరిపోయే ఐటెంసాంగ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు దేవిశ్రీ.

First Published:  9 April 2015 1:30 AM GMT
Next Story