Telugu Global
Cinema & Entertainment

's/o సత్యమూర్తి' రివ్యూ

రేటింగ్: 2/5 సత్యమూర్తి (ప్రకాశ్ రాజ్) ప్రముఖ బిజినెస్ మెన్. 300 కోట్ల ఆస్తిపరుడు. అతని కుమారుడు విరాజ్ ఆనంద్ ఉరఫ్ (అల్లు అర్జున్). తండ్రి చేసే పనుల్ని అప్పుడప్పుడు వ్యతిరేకించినా ఆయన పాటించే విలువుల పట్ల గౌరవమున్న వ్యక్తి.  ఓ రోడ్ యాక్సిండెట్ లో సత్యమూర్తి ప్రమాదంలో చనిపోతాడు. అన్నయ్య   షాక్ గురై మెంటల్ అప్ సెట్ అవుతాడు. తండ్రి కారణంగా అప్పులు పెరిగిపోతాయి. విలువలకు కట్టుబడి ఆస్తి నంతా అమ్మేసి అప్పులు తీర్చుతాడు. […]

s/o సత్యమూర్తి  రివ్యూ
X

రేటింగ్: 2/5
సత్యమూర్తి (ప్రకాశ్ రాజ్) ప్రముఖ బిజినెస్ మెన్. 300 కోట్ల ఆస్తిపరుడు. అతని కుమారుడు విరాజ్ ఆనంద్ ఉరఫ్ (అల్లు అర్జున్). తండ్రి చేసే పనుల్ని అప్పుడప్పుడు వ్యతిరేకించినా ఆయన పాటించే విలువుల పట్ల గౌరవమున్న వ్యక్తి. ఓ రోడ్ యాక్సిండెట్ లో సత్యమూర్తి ప్రమాదంలో చనిపోతాడు. అన్నయ్య షాక్ గురై మెంటల్ అప్ సెట్ అవుతాడు. తండ్రి కారణంగా అప్పులు పెరిగిపోతాయి. విలువలకు కట్టుబడి ఆస్తి నంతా అమ్మేసి అప్పులు తీర్చుతాడు. దాంతో సత్యమూర్తి కుటుంబం రోడ్డున పడుతుంది. విలాస జీవితమే తెలిసిన ఆనంద్ కు జీవితమంటే ఏమిటో అర్థమవుతుంది. కుటుంబ పోషణ ఆనంద్ పడుతుంది. ఆర్థిక ఇబ్బందులతో వెడ్డింగ్ ప్లానర్ మారాల్సి వస్తుంది. పెళ్లిలో సత్యమూర్తి స్నేహితుడు సాంబశివరావు (రాజేంద్రప్రసాద్) కూతురు సమీరాను చూసి లవ్ లో పడుతాడు. ఆనంద్ అంటే సాంబశివరావు గిట్టదు. సమీరాను ఇచ్చి పెళ్లి చేయడానికి నిరాకరిస్తాడు. సత్యమూర్తి వల్ల తాను నష్టపోయానని, ఆయన విలువలేని వ్యక్తి అని ఆరోపణలు చేస్తాడు. తన తండ్రిపై పడిన నింద తప్పు అని, తన తండ్రి నిజాయితీ పరుడని నిరూపించడానికి ఆనంద్ ఓ బాధ్యతను తనపై వేసుకుంటాడు. ఆ బాధ్యతను నాలుగువారాల్లో పూర్తి చేస్తే సమీరాను పెళ్లి చేస్తానని సాంబశివరావు సవాల్ విసురుతాడు. ఆ క్రమంలో దేవరాజ్ నాయుడు (ఉపేంద్ర), వల్లి (నిత్యమీనన్) ను కలుసుకుంటాడు. ఈ కథకు దేవరాజ్ నాయుడు, వల్లిలకు సంబంధమేమిటి, సత్యమూర్తి వల్ల సాంబశివరావుకు ఏం నష్టం జరిగింది. తండ్రిపై పడిన నిందను తుడిపేయడానికి ఆనంద్ ఏలాంటి సంఘటనల్ని ఎదుర్కొన్నాడు? ఈ కథలో మరో హీరోయిన్ ఆదాశర్మ పాత్రమిటి? సమీరాను ఎలా దక్కించుకున్నాడన్నదే ‘s/o సత్యమూర్తి’ కథ.
విరాజ్ ఆనంద్ గా మరోసారి ఫెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఫుల్ ఎనర్జీ, జోష్ తో కనిపించాడు. బాధ్యయుతమైన కుమారుడిగా కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ పండించడంలో తన మార్కును చూపించాడు. పాటలు, ఫైట్స్, యాక్టింగ్ లో సత్తా చూపించాడు. ఆదాశర్మ, సమంతా, నిత్యమీనన్ ల పర్వాలేదనించారు. సమంత పాటలకే పరిమితమైంది. కథలో భాగంగా ప్రధాన పాత్రను పోషించినా అంతగా గొప్ప పేరు తెచ్చే పాత్రమే కాదు. నిత్యమీనన్ ది అదే పరిస్థితి. ఆలీ, బ్రహ్మనందం కామిడి అభాసుపాలైంది. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై దేవరాజ్ నాయుడు పాత్రలో ఉపేంద్ర కనిపించాడు. నెగిటివ్ షేడ్ లో ఉపేంద్ర పోషించిన పాత్ర ఆకట్టుకోలేకపోయిది. కొన్నిసార్లు ఆ పాత్రకు ఆయన సరిపోడనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగమానదు. రావు రమేశ్ ది కూడా పెద్దగా చెప్పుకోవాల్సని పాత్రేమి కాదు. ఇక చిత్రంలో చాలా పాత్రలున్నా అలా వచ్చి ఇలా పోయేవే.

టెక్నికల్:
సాంకేతిక విభాగంలో ప్రసాద్ మూరెళ్ల పనితనం ఆకట్టుకున్నది. ఆయన పనితనం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఇక ఎడిటర్ ప్రవీణ్ పూడికి కత్తెరకు పెద్దగా పనికల్పించలేదేమో అనే సందేహం కలుగుతుంది. ప్రవీణ్ కత్తెరకు మరింత పదును పెట్టాల్పిందే. దేవీశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు వినడానికే కాకుండా తెరపై కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే పాటల ప్లేస్ మెంట్ సరిగా లేకపోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. మరోసారి దేవీ ఆకట్టుకున్నాడనే చెప్పవచ్చు.

విశ్లేషణ:

సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ‘ర్యాంక్ కొట్టిన స్టూడెంట్ పాస్ మార్కులు తెచ్చుకోవడమేంటబ్బా అనే భావన కలుగుతుంది. మాటలతో మ్యాజిక్, వినోదం, పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టే త్రివిక్రమ్ కలం పదను తగ్గిందా అనిపిస్తుంది. సినిమా మొత్తం డైలాగ్స్ నిండినా ఆకట్టుకొనేలా లేకపోవడం మైనస్ పాయింట్. డైలాగ్స్ మాటున కథనం, కథ మరుగునపడ్డాయనిపిస్తుంది. కథ ఎంపికలోనూ, ఉన్న కథను చెప్పడంలోనూ త్రివిక్రమ్ తడబాటుకు గురయ్యాడు. భారీ తారాగణం వారి పాత్రల చిత్రీకరణలో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. విలువల చాటున ‘s/o సత్యమూర్తి’ ఓ మోస్తారు చిత్రంగా నిలువడం ఖాయం.

నటీనటులు: అల్లు అర్జున్, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్ రాజ్, సమంత, అదాశర్మ, నిత్యమీనన్, స్నేహ, బ్రహ్మానందం, ఆలీ, కోట శ్రీనివాసరావు, రావు రమేశ్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, సురేఖవాణి, సింధు తులానీ తదితరులు
సంగీతం: దేవీశ్రీప్రసాద్,
కెమెరా: ప్రసాద్ మూరేళ్ల
ఎడిటర్: ప్రవీణ్ పూడి
నిర్మాత: ఎస్ రాధాకృష్ణ
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్

First Published:  9 April 2015 3:45 AM GMT
Next Story