కూలీల‌ ఎన్‌కౌంట‌ర్‌పై  ఏపీకి హైకోర్టు ఝ‌ల‌క్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్‌కౌంట‌ర్‌గా చెప్పుకొస్తున్న ఎపీ ప్ర‌భుత్వాన్ని ఈ కేసును హ‌త్య కేసుగా న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. చిత్తూరు జిల్లా తిరుప‌తి ప‌రిస‌రాల్లో జ‌రిగిన ఈ ఎన్‌కౌంట‌ర్‌లో 20 మంది కూలీలు హ‌త‌మైపోయిన విష‌యం తెలిసిందే. ఎన్‌కౌంట‌ర్‌పై అనేక అనుమానాలు వ్య‌క్త‌మవుతున్న నేప‌థ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్త‌ర్వులు ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేసింది.  302 సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేయాలని ఆదేశించిన అనంత‌రం కేసు విచార‌ణ‌ను సోమ‌వారం నాటికి వాయిదా వేసింది.-పీఆర్‌