Telugu Global
NEWS

అంత‌రాష్ట్ర ప‌న్ను క‌ట్టాల్సిందే... కానీ

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ర‌వాణా పన్నుపై హైకోర్టు మ‌రోసారి మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. అయితే ఈ కేసుపై తుది తీర్పు వెలువ‌డే వ‌ర‌కు ప‌న్ను చెల్లిస్తూనే ఉండాల‌ని అంత‌రాష్ట్ర ఆప‌రేట‌ర్ల‌ను కోరింది. ప‌న్నును నేరుగా క‌ట్ట‌కుండా సంస్థ పేరుతో ఒక ఖాతా తెరిచి అందులో ప‌న్ను మొత్తాన్ని జ‌మ‌చేయాల‌ని, తుది తీర్పుకు లోబ‌డి ఈ మొత్తాన్ని వినియోగించాల్సి ఉన్నందున వేరే ఖ‌ర్చుల‌కు దీన్ని ఉప‌యోగించ‌రాద‌ని ఆదేశించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దే్శ్‌, […]

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ర‌వాణా పన్నుపై హైకోర్టు మ‌రోసారి మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. అయితే ఈ కేసుపై తుది తీర్పు వెలువ‌డే వ‌ర‌కు ప‌న్ను చెల్లిస్తూనే ఉండాల‌ని అంత‌రాష్ట్ర ఆప‌రేట‌ర్ల‌ను కోరింది. ప‌న్నును నేరుగా క‌ట్ట‌కుండా సంస్థ పేరుతో ఒక ఖాతా తెరిచి అందులో ప‌న్ను మొత్తాన్ని జ‌మ‌చేయాల‌ని, తుది తీర్పుకు లోబ‌డి ఈ మొత్తాన్ని వినియోగించాల్సి ఉన్నందున వేరే ఖ‌ర్చుల‌కు దీన్ని ఉప‌యోగించ‌రాద‌ని ఆదేశించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దే్శ్‌, తెలంగాణ‌ ప్ర‌భుత్వాలు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. కాగా అంతర్ రాష్ట్ర పన్ను విధానంపై హైకోర్టు చెప్పిన‌ట్టే న‌డుచుకుంటామ‌ని తెలంగాణ ర‌వాణాశాఖ మంత్రి మ‌హేంద్ర‌రెడ్డి చెప్పారు.-పీఆర్‌
First Published:  10 April 2015 7:17 AM GMT
Next Story