ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల‌పై తెలుగు రాష్ట్రాల క‌స‌ర‌త్తు

ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ఇంటర్‌ బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. పరీక్షలు  అనుకున్న స‌మ‌యానిక‌న్నా ముందుగానే పూర్తయినందున తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు ముందుగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈనెల నాలుగో వారంలో మొదటి సంవత్సరం ఫలితాలు.. తర్వాత రెండో ఏడాది ఫలితాలు ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలు కూడా ఈ నెలలోనే విడుదల‌ చేయాలని అధికారులు భావిస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం తుది దశలో ఉన్నందున వచ్చే వారం ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.-పీఆర్‌