Telugu Global
Cinema & Entertainment

బాక్సాఫీస్ బరిలో సమ్మర్ వార్      

టాలీవుడ్ కు కాసులు కురిపించే సీజన్స్ లో సమ్మర్ కూడా ఒకటి కావడంతో స్టార్ హీరోలంతా ఈ 3 నెలల్నే టార్గెట్ చేశారు. అల్లువారబ్బాయ్ తో బాక్సాఫీస్ బరిలో ఈ ఏడాది వేసవి యుద్ధం మొదలైంది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. మిగిలిన ఈ 2 నెలల కాలంలో మరిన్ని భారీ చిత్రాలుబాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి.           సన్నాఫ్ సత్యమూర్తికి పోటీగా బాహుబలి, రుద్రమదేవి సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపు రెండేళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, […]

బాక్సాఫీస్ బరిలో సమ్మర్ వార్      
X

టాలీవుడ్ కు కాసులు కురిపించే సీజన్స్ లో సమ్మర్ కూడా ఒకటి కావడంతో స్టార్ హీరోలంతా ఈ 3 నెలల్నే టార్గెట్ చేశారు. అల్లువారబ్బాయ్ తో బాక్సాఫీస్ బరిలో ఈ ఏడాది వేసవి యుద్ధం మొదలైంది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. మిగిలిన ఈ 2 నెలల కాలంలో మరిన్ని భారీ చిత్రాలుబాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి. సన్నాఫ్ సత్యమూర్తికి పోటీగా బాహుబలి, రుద్రమదేవి సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపు రెండేళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో బాహుబలి సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటున్న బాహుబలి పార్ట్-1 ఈ వేసవిలోనే విడుదలకు సిద్ధమౌతోంది. ప్రభాస్-అనుష్క-తమన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నెలలోనే బాహుబలిని విడుదల చేయడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ, గ్రాఫిక్ వర్క్ పూర్తికాకపోవడంతో.. మే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రుద్రమదేవి సినిమా కూడా ఈ వేసవిలోనే సందడి చేయనుంది. అనుష్క లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో అల్లుఅర్జున్, రానా కీలకపాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్ తో అన్నీ తానై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. ఈమధ్యే ఆడియోను కూడా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇళయరాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణగా చెబుతున్నారు. సో.. ఈ వేసవి బరిలో అనుష్క కూడా బన్నీకి, ప్రభాస్ కి సవాల్ విసురుతోంది. మరోవైపు బాలకృష్ణ కూడా తన లయన్ సినిమాను శరవేగంగా సిద్ధం చేస్తున్నాడు. సత్యదేవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలయ్య ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇది కూడా సమ్మర్ ఎట్రాక్షన్ గానే రాబోతోంది. మరి ఈ ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఏది వేసవి విజేతగా నిలుస్తుందనేది తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

First Published:  9 April 2015 5:46 PM GMT
Next Story