Telugu Global
Cinema & Entertainment

బాల‌య్య‌కు బాల‌య్యే పోటి -సీఎం చంద్ర‌బాబు

కొత్త ద‌ర్శ‌కుడు స‌త్య‌దేవ్ డైరెక్ష‌న్లో  బాల‌య్య చేస్తున్న ల‌య‌న్ చిత్రం ఆడియో విడుద‌ల గురువారం  హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ వేడుక‌కు ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ముఖ్య అతిధిగా  హ‌జ‌ర‌య్యారు.  మ‌ణి శ‌ర్మ సంగీతం అందించారు. అయితే వేడుక‌లో  చంద్ర‌బాబు  బాల‌య్య ను  ఆకాశానికి ఎత్తేశారు.  తెలుగు చిత్ర సీమలో మాస్ హీరో అంటే  బాల‌య్యేన‌ని ఆయ‌న పోషించే రోల్స్ ఇండ‌స్ట్రీలో  ఇంకెవ‌రు చేయ‌లేరు.  ఏ సినిమా న‌టుడికి లేని అభిమాన గ‌ణం బాల‌య్య‌కు ఉంద‌న్నారు. […]

బాల‌య్య‌కు బాల‌య్యే పోటి -సీఎం చంద్ర‌బాబు
X
కొత్త ద‌ర్శ‌కుడు స‌త్య‌దేవ్ డైరెక్ష‌న్లో బాల‌య్య చేస్తున్న ల‌య‌న్ చిత్రం ఆడియో విడుద‌ల గురువారం హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ వేడుక‌కు ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ముఖ్య అతిధిగా హ‌జ‌ర‌య్యారు. మ‌ణి శ‌ర్మ సంగీతం అందించారు. అయితే వేడుక‌లో చంద్ర‌బాబు బాల‌య్య ను ఆకాశానికి ఎత్తేశారు. తెలుగు చిత్ర సీమలో మాస్ హీరో అంటే బాల‌య్యేన‌ని ఆయ‌న పోషించే రోల్స్ ఇండ‌స్ట్రీలో ఇంకెవ‌రు చేయ‌లేరు. ఏ సినిమా న‌టుడికి లేని అభిమాన గ‌ణం బాల‌య్య‌కు ఉంద‌న్నారు. అంతే కాకుండా.. ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న‌కు ఆయ‌నే పోటి అంటూ కితాబిచ్చారు.
అయితే ఈ పొగ‌డ్త మెగా అభిమానుల‌కు ఎక్క‌డో తాకుతుంది అనేది స‌మాచారం. ఎందుకంటే.. మెగాస్టార్ చిరుకు వున్నఫాలోయింగ్ కానీ.. మాస్ హీరోగా ఆయ‌న‌కు వున్న క్రేజ్ సాధార‌ణ‌మైన‌ది కాదు క‌దా.! ఏంటో బాబు పొగ‌డ్త వియ్య‌కుడ‌ు బాల‌య్య‌ను సంతోష ప‌రచవ‌చ్చు కానీ.. మ‌రోస్టార్ హీరో ఫ్యాన్స్ ను డిజ‌పాయింట్ చేసింద‌నే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో త్రిష‌, రాధిక ఆప్టే హీరోయిన్స గా చేశారు.ఈ చిత్రం ట్రైల‌ర్ అభిమానుల్ని మాత్రం ఇంప్రెస్ చేస్తుంది .
First Published:  10 April 2015 2:16 AM GMT
Next Story