Telugu Global
NEWS

చిత్తూరుజిల్లాలో టెన్ష‌న్... టెన్ష‌న్‌

శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని వైగో ప్రకటన చేసిన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏపీ నుంచి తమిళనాడుకు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ఎర్రచందనం దొంగల ఎన్‌కౌంటర్‌పై తమిళనాడులో ఆందోళనలు తీవ్రమయ్యాయి. అటు తమిళనాడు పోలీసులు, ఇటు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. రోడ్డు మార్గంలోనూ, ఇతర […]

శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని వైగో ప్రకటన చేసిన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏపీ నుంచి తమిళనాడుకు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ఎర్రచందనం దొంగల ఎన్‌కౌంటర్‌పై తమిళనాడులో ఆందోళనలు తీవ్రమయ్యాయి. అటు తమిళనాడు పోలీసులు, ఇటు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. రోడ్డు మార్గంలోనూ, ఇతర మార్గాల్లోనూ ఆందోళనకారులు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో జిల్లా వ్యాప్తంగా జల్లెడపడ్తున్నారు పోలీసులు. ఇటీవలే చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ని తమిళనాడులో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. 20 మంది ఎర్ర చందనం దొంగలు ఎన్‌కౌంటర్‌లో హతం కాగా, వారంతా తమిళనాడుకు చెందినవారే. ఎన్‌కౌంటర్‌ భూటకమంటూ గ‌త మూడు రోజుల నుంచీ త‌మిళ‌నాట‌ ఆందోళన కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక పోలీసులు, సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.-పీఆర్‌.

First Published:  10 April 2015 1:02 AM GMT
Next Story