విరాట్ కోహ్లీకి కోపం వ‌చ్చింది.

గ‌త ఐదేళ్ళ కెరీర్‌లో నా క‌న్నా ఎక్కువ మ్యాచ్‌లు ఎవ‌రు గెలిచారో చెప్పండి… నా గ‌ర్ల్ ఫ్రండ్ మీద అబాంఢాలు వేయ‌డానికి సిగ్గు ప‌డాలి… అంటూ అనుష్క‌శ‌ర్మ మీద సెటైర్లు వేసే విమ‌ర్శ‌కుల నోటికి తాళం వేసే ప్ర‌య‌త్నం చేశాడు విరాట్ కోహ్లీ. సోష‌ల్ మీడియా నుంచే కాకుండా వివిధ ర‌కాలుగా త‌న గ‌ర్ల్ ఫ్రండ్ అనుష్క మీద వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కు జ‌వాబు చెప్ప‌డానికే అన్న‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ ముగిసిన త‌ర్వాత తొలిసారిగా ఆయ‌న పెద‌వి విప్పి విమ‌ర్శ‌లు గుప్పించాడు. ఆమె మీద చేసిన విమ‌ర్శ‌లు మ‌నిషిగా న‌న్ను ఎంతో బాధ పెట్టాయి. న‌న్ను బాగా క‌ల‌చివేసేట్టు చేశాయి. గ‌త ఐదేళ్ళుగా ఎన్నో మ్యాచ్‌ల్లో భార‌త్ గెల‌వ‌డానికి నావంతు కృషి ఎంతో ఉంది. ఇదంతా మ‌రిచిపోయి ఇలా విమ‌ర్శ‌లు గుప్పించ‌డానికి సిగ్గుప‌డాలి… అని విమ‌ర్శ‌కుల నోరు మూయించే ప్ర‌య‌త్నం చేశాడు విరాట్ కోహ్లీ. -పీఆర్‌