Telugu Global
Cinema & Entertainment

బంగారం లాంటి అవకాశం

 హీరోయిన్ అంజలి అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంటుంది. ఆమెకు అందంతో పాటు టాలెంట్ కూడా ఉంది. కానీ ఇప్పటితరం హీరోల పక్కన సూట్ కాలేకపోతోంది. మొత్తమ్మీద ఎలాగోలా కెరీర్ నెట్టుకొస్తున్న ఈ టాలీవుడ్ సీతమ్మకి నిజంగానే బంగారంలాంటి అవకాశం ముంగిట్లోకొచ్చింది. నందమూరి బాలకృష్ణ సినిమాలో నటించే ఛాన్స్ కు ఒక్క మెట్టు దూరంలో ఉంది అంజలి.  ప్రస్తుతం లయన్ అనే సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీ విడుదలైన వెంటనే […]

బంగారం లాంటి అవకాశం
X
హీరోయిన్ అంజలి అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంటుంది. ఆమెకు అందంతో పాటు టాలెంట్ కూడా ఉంది. కానీ ఇప్పటితరం హీరోల పక్కన సూట్ కాలేకపోతోంది. మొత్తమ్మీద ఎలాగోలా కెరీర్ నెట్టుకొస్తున్న ఈ టాలీవుడ్ సీతమ్మకి నిజంగానే బంగారంలాంటి అవకాశం ముంగిట్లోకొచ్చింది. నందమూరి బాలకృష్ణ సినిమాలో నటించే ఛాన్స్ కు ఒక్క మెట్టు దూరంలో ఉంది అంజలి.
ప్రస్తుతం లయన్ అనే సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీ విడుదలైన వెంటనే తన 99వ సినిమాను పట్టాలపైకి తీసుకురావాలనుకుంటున్నాడు బాలయ్య. ఈ సినిమాలోనే అంజలిని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు కోనవెంకట్, గోపీమోహన్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. వీళ్లలో కోన వెంకట్ కు అంజలి బాగా క్లోజ్. ఆ పరిచయంతోనే అంజలి పేరును బాలయ్య ముందు ప్రస్తావించాడు కోనవెంకట్. బాలయ్య వెంటనే ఓకే చెప్పకపోయినా ఆలోచిస్తానని మాటిచ్చారు. సో.. అన్నీ అనుకున్నట్టు జరిగితే బాలయ్య 99వ సినిమాలో అంజలి హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయినట్టే.
First Published:  10 April 2015 5:03 PM GMT
Next Story