Telugu Global
Cinema & Entertainment

హీరో కాకుండానే ఫ్యాన్ ఫాలోయింగ్..

 ఒకప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవడం చాలా కష్టమైన పని. వరుసగా సినిమాలు హిట్టవ్వాలి. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టయిల్ ఏర్పాటుచేసుకోవాలి. అప్పటికిగానీ అభిమాన వర్గం తయారవ్వదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండానే ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవచ్చు. ఈ విషయాన్ని చేతల్లో చూపించాడు మన సిసింద్రి అక్కినేని అఖిల్. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మధ్యలో అఖిల్ బర్త్ డే […]

హీరో కాకుండానే ఫ్యాన్ ఫాలోయింగ్..
X
ఒకప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవడం చాలా కష్టమైన పని. వరుసగా సినిమాలు హిట్టవ్వాలి. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టయిల్ ఏర్పాటుచేసుకోవాలి. అప్పటికిగానీ అభిమాన వర్గం తయారవ్వదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండానే ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవచ్చు. ఈ విషయాన్ని చేతల్లో చూపించాడు మన సిసింద్రి అక్కినేని అఖిల్.
ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మధ్యలో అఖిల్ బర్త్ డే వచ్చింది. ముఖానికి రంగేసుకున్న తర్వాత తొలి పుట్టినరోజు కాబట్టి అఖిల్ సినిమాకు సంబంధించి టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. సినిమాలో స్టార్టింగ్ అఖిల్ కనిపించడు. ఫస్ట్ నుంచి దాదాపు లాస్ట్ వరకు దర్శకుడు వినాయకే దర్శనమిస్తాడు. అఖిల్ మాత్రం చివర్లో ఓ 3-4 షాట్స్ లో ఇలా కనిపించి అలా మాయమౌతాడు. కానీ ఆ చిన్నపాటి టీజర్ కే అభిమానులు బ్రహ్మరథం పట్టారు. నెట్ లో ఒక్కరోజులోనే ఆ టీజర్ కు 3 లక్షల క్లిక్కులొచ్చాయి. అలా హీరో అవ్వకుండానే అభిమానుల్ని సంపాదించుకున్నాడు అఖిల్.
First Published:  11 April 2015 6:38 AM GMT
Next Story