Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 43

బిజినెస్‌ మైండ్‌ ఒక వ్యాపారస్తుడు మరణశయ్యపై ఉన్నాడు. భార్య దగ్గరకి వెళ్ళి ‘మీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం’ అంది. వ్యాపారస్తుడు హీన స్వరంతో కొడుకుల్ని గుర్తు చేసుకుని ‘వెంకట్‌ ఏడి?’ అన్నాడు ‘ఇక్కడే ఉన్నాడండి’ అంది. ‘సునీల్‌ ఏడి’? ‘ఇక్కడే ఉన్నాడండి’ ‘మోహన్‌ ఏడి?’ ‘మీ పక్కనే ఉన్నాడండి’ అంది. ‘అందరూ ఇక్కడే ఉంటే షాపులో ఎవరుంటారు?’ అన్నాడు మూలుగుతూ. *********** హలో… హలో.. నాలుగేళ్ళ కుర్రాడు ఫోన్‌ ఎత్తి బదులిస్తున్నాడు ‘హలో!’ ‘హలో! మీ నాన్నగారున్నారా?’ ‘లేరు, […]

బిజినెస్‌ మైండ్‌
ఒక వ్యాపారస్తుడు మరణశయ్యపై ఉన్నాడు.
భార్య దగ్గరకి వెళ్ళి ‘మీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం’ అంది.
వ్యాపారస్తుడు హీన స్వరంతో కొడుకుల్ని గుర్తు చేసుకుని
‘వెంకట్‌ ఏడి?’ అన్నాడు
‘ఇక్కడే ఉన్నాడండి’ అంది.
‘సునీల్‌ ఏడి’?
‘ఇక్కడే ఉన్నాడండి’
‘మోహన్‌ ఏడి?’
‘మీ పక్కనే ఉన్నాడండి’ అంది.
‘అందరూ ఇక్కడే ఉంటే షాపులో ఎవరుంటారు?’ అన్నాడు మూలుగుతూ.

***********

హలో… హలో..
నాలుగేళ్ళ కుర్రాడు ఫోన్‌ ఎత్తి బదులిస్తున్నాడు
‘హలో!’
‘హలో! మీ నాన్నగారున్నారా?’
‘లేరు, ఆయన ఇంట్లో లేరు’
‘మీ అమ్మగారు?’
‘ఆమె కూడా లేరు’.
‘మీ బ్రదర్‌!’
‘ఉన్నాడు’
‘కొద్దిగా పిలుస్తావా?’
‘కుదరదు’
‘ఎందుకు?’
‘ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు’.

***********

ఆవు… గడ్డి
ఆర్ట్‌ టీచర్‌ : నేను గడ్డిమేస్తున్న ఆవు బొమ్మ గియ్యమన్నాను కదా!
స్టూడెంట్‌ : గీశాను టీచర్‌.
టీచర్‌ : మరి గడ్డి ఏది?
స్టూడెంట్‌ : ఆవు తినేసింది టీచర్‌.
టీచర్‌ : మరి ఆవు ఏది?
స్టూడెంట్‌ : గడ్డి తిని వెళ్ళిపోయింది టీచర్‌.

***********

లోకల్‌
డాక్టర్‌ : నీకు లోకల్‌ అనస్తీషియా ఇమ్మంటావా?
పేషెంట్‌ : వద్దండీ, ఎంత ఖర్చయినా ఫరవాలేదు. ఇంపోర్టెడ్‌ ఇవ్వండి.

First Published:  11 April 2015 8:09 AM GMT
Next Story