ఏపీకి ప్రత్యేక హోదా కోసం మే 14న సీపీఐ ఆందోళ‌న  

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మే 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా త‌మ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని సీపీఐ నేత నారాయణ చెప్పారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు అలసత్వం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మాట్లాడుతూ… కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ఏపీకి ప్రత్యేకహోదా తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోద్బలంతోనే శేషాచలం ఎన్‌కౌంటర్‌లో అసలైన స్మగ్లర్లను వదిలేసి కూలీలను చంపడం దారుణమని నారాయణ ఆరోపించారు.-పీఆర్‌.