Telugu Global
NEWS

తుళ్ళూరు బ‌స్సుల‌కు అదిరిపోయే కలెక్షన్స్‌

విజయవాడ – తుళ్ళూరు వయా అమరావతి మార్గంలో న‌డిచే మెట్రో సర్వీసుకు కాసుల వ‌ర్షం కురుస్తోంది నెల రోజుల్లో వ్య‌వ‌ధిలో ఆక్యుపెన్సీ రేటు ఐదు నుంచి ప‌ది శాతం పెరగటంతో సర్వీసులకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు చొప్పున ఈ రూట్‌లో మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు న‌డుస్తున్నాయి. స్థానిక ప్రజల అవసరాలు, రాజధాని ప్రాంతానికి డైరెక్టుగా వచ్చే వారికి ఈ సర్వీసులు బాగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. దీంతో 80 శాతం ఆక్యుపెన్సీతో ఈ బస్సులు కళకళలాడుతున్నాయి. […]

విజయవాడ – తుళ్ళూరు వయా అమరావతి మార్గంలో న‌డిచే మెట్రో సర్వీసుకు కాసుల వ‌ర్షం కురుస్తోంది నెల రోజుల్లో వ్య‌వ‌ధిలో ఆక్యుపెన్సీ రేటు ఐదు నుంచి ప‌ది శాతం పెరగటంతో సర్వీసులకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు చొప్పున ఈ రూట్‌లో మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు న‌డుస్తున్నాయి. స్థానిక ప్రజల అవసరాలు, రాజధాని ప్రాంతానికి డైరెక్టుగా వచ్చే వారికి ఈ సర్వీసులు బాగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. దీంతో 80 శాతం ఆక్యుపెన్సీతో ఈ బస్సులు కళకళలాడుతున్నాయి. ఆర్టీసీకి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. ఆటోలు అంతగా లేని ప్రాంతాలు కావటం, ఈ రూట్‌ దాదాపు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు అనుసంధానంగా ఉండటంతో ప్రజలు ఈ బస్సులకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం విజయవాడ – తుళ్ళూరు వయా అమరావతికి మెట్రో ఎక్స్‌ప్రెస్‌, తెలుగు వెలుగు సర్వీసులను విజయవాడ సిటీ డివిజన్‌ పరిధిలోని గవర్నర్‌ పేట-2 డిపో నుంచే ఆప‌రేట్ చేస్తున్నారు. ఈ డిపో పరిధిలో విజయవాడ – తుళ్ళూరు వయా అమరావతి వరకు 8 మెట్రో సర్వీసులు నడుపుతున్నాయి.-పీఆర్‌

First Published:  11 April 2015 4:42 AM GMT
Next Story