శ్రీవారిని దర్శించుకున్న శృతిహాసన్

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శృతిహాసన్ స్వామివారి సేవలో తరించింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామునే తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకుంది శృతి. నిర్మాత ఎన్ వీ ప్రసాద్ తో కలిసి తిరుమల చేరుకున్నశృతిహాసన్, అక్కడ్నుంచి నేరుగా స్వామివారి ఆలయానికి చేరుకుంది. ప్రత్యేక దర్శనం చేసుకున్న తర్వాత శృతిహాసన్ కు ఆలయ కమిటీ సభ్యులు ప్రసాదం అందజేశారు.