స్వ‌చ్ఛ ఎవ‌రెస్ట్‌కు న‌డుం క‌ట్టిన భార‌త్ సేన‌లు

స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఎవరెస్ట్‌పై ఉన్న చెత్తను తొలగించేందుకు భారత సైన్యం న‌డుం క‌ట్టింది. 34 మందితో కూడిన భారత సైనిక బృందం నేపాల్‌ మీదుగా ఎవరెస్ట్‌ చేరుకునేందుకు బయలుదేరింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో పర్వతారోహకులు తమతోపాటు తెచ్చుకున్న వివిధ పదర్థాల వ్యర్థాలను అక్కడే వదిలేసి వస్తున్నారు. అలా వదిలేసిన చెత్త దాదాపు నాలుగు వేల టన్నుల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘‘స్వచ్ఛ్‌ భారత్‌’’ మిషన్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కే సాహ‌సం చేస్తుంది. క్లిన్‌ ఇండియా ప్రాజెక్టుకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన ల‌భిస్తుండ‌డంతో ఈ స్ఫూర్తితో భారత సైన్యం ఈ బృహత్‌ కార్యానికి శ్రీకారం చుట్టింది. ఎవరెస్ట్‌ శిఖరంపై పేరుకుపోయిన చెత్తను తొలగించ‌డ‌మే ల‌క్ష్యంగా భార‌త సేన‌ల బృందం క‌దిలింది. వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్‌… -పీఆర్‌