ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్ళీ లేచాడు!

నాయ‌కుడ‌నే వాడు జ‌నంలో ఉంటాడు… ఉండాలి… అది నాయ‌కుల నైజం. కాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం తాను ఇంకా నాయ‌కుడ్ని కాద‌నుకుంటున్నాడేమో జ‌నంలోకి రాడు… వ‌చ్చినా నిల‌క‌డ‌గా ఉండ‌డు… ఉన్నా నిల‌క‌డ మాట‌లు మాట్లాడ‌డు… ఆ మ‌ధ్య గుంటూరు వెళ్ళి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని నిర్మాణానికి భూములు ఇవొద్ద‌ని… ఒక‌వేళ బ‌ల‌వంతంగా లాక్కుంటే అంగీక‌రించ‌వ‌ద్ద‌ని, మీ వెంట నేనుంటాన‌ని వాళ్ళ‌తో కూర్చుని మ‌రీ భ‌‌రోసా ఇచ్చి వ‌చ్చేశాడు. హైద‌రాబాద్ వ‌చ్చాడో లేదో వెంట‌నే అక్క‌డ రైతులంతా ఎంతో అనందంగా భూములు ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని ఓ ప్ర‌క‌ట‌న ఇచ్చేశాడు. ఈయ‌న‌కి ఏమ‌య్యిందో ఏమో కాని నిల‌క‌డ లేని ప్ర‌క‌ట‌న‌లు… నిల‌క‌డ లేని హామీలు…
బ‌లవంతంగా భూములు ఎవ‌రి ద‌గ్గ‌ర నుంచీ తీసుకోవ‌ద్ద‌ని హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించిన త‌ర్వాత ప్ర‌భుత్వం ఆచితూచి అడుగేస్తోంది. అన్న‌దాత‌లు కావాల‌నుకుంటే పంట‌లు కూడా పండించుకోవ‌చ్చ‌ని కూడా కోర్టు చెప్పింది. దాంతో రైతుల్లోని ఓ వ‌ర్గం ఆనందానికి అంతే లేదు. స‌రిగ్గా ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ మ‌ళ్ళీ నిద్ర లేచాడు… మ‌ళ్ళీ ఓ ప్ర‌క‌ట‌న చేశాడు. బ‌ల‌వంతంగా భూములు తీసుకునే ప్ర‌య‌త్నాల‌ను స‌హించేది లేద‌ని, ఎవ‌రైనా ఈ చ‌ర్య‌కు పాల్ప‌డితే త‌న‌కు చెప్ప‌మ‌ని, మీ వెంట నేనుంటాన‌ని మ‌రోసారి భ‌రోసా ఇచ్చాడు. ఇంత‌కీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రైతుల త‌ర‌ఫు నాయ‌కుడా? లేక ప్ర‌భుత్వం త‌ర‌ఫు మ‌నిషా అర్ధం కాక బుర్ర‌లు గోక్కుంటున్నారు జ‌నం. ఏంటో ఓ ప‌ట్టాన అర్ధం కాని నాయ‌కుడు ప‌వ‌న్‌… ఈయ‌న మ‌రి భ‌విష్య‌త్‌లో న‌డిపించే నాయ‌కుడు అవుతాడో… ఇలాగే అప్పుడ‌ప్పుడూ నిద్ర లేచి ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లే చేస్తాడో చూడాల్సిందే!-పీఆర్‌