Telugu Global
Cinema & Entertainment

సమంత ఇంటికి దారేది ?

ప్ర‌తి ద‌ర్శ‌కుడి మీద  అభిమానుల‌కు ఒక వ్యూ వుంటుంది.  హీరోయిన్స్ ను స్క్రీన్ మీద చూపించే విధానం .. హీరో యిజాన్ని ఎలివేట్ చేసే  విధానం ఎవ‌రెవ‌రు  ఎలా చేస్తారు అనేది  ప్రేక్ష‌కుల‌కు  ఐడియా వుంటుంది. అలాగే ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ అంటే  హీరోయిన్స్ ను కొంత ట్రెడిష‌న‌ల్ లుక్ లో చూప‌డానికే ఎక్కువ మ‌క్కువ చూపిస్తారు. అభిమానులు కూడా అలాగే ఆశిస్తారు.  అయితే స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి  చిత్రంలో  హీరోయిన్ స‌మంతను  కాస్త  ఓవ‌ర్ గానే చూపించార‌ట‌.  వాస్త‌వంగా […]

సమంత ఇంటికి దారేది ?
X
ప్ర‌తి ద‌ర్శ‌కుడి మీద అభిమానుల‌కు ఒక వ్యూ వుంటుంది. హీరోయిన్స్ ను స్క్రీన్ మీద చూపించే విధానం .. హీరో యిజాన్ని ఎలివేట్ చేసే విధానం ఎవ‌రెవ‌రు ఎలా చేస్తారు అనేది ప్రేక్ష‌కుల‌కు ఐడియా వుంటుంది. అలాగే ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ అంటే హీరోయిన్స్ ను కొంత ట్రెడిష‌న‌ల్ లుక్ లో చూప‌డానికే ఎక్కువ మ‌క్కువ చూపిస్తారు. అభిమానులు కూడా అలాగే ఆశిస్తారు. అయితే స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రంలో హీరోయిన్ స‌మంతను కాస్త ఓవ‌ర్ గానే చూపించార‌ట‌. వాస్త‌వంగా తెలుగులో ఆఫ‌ర్స్ పెద్ద‌గా లేని స‌మంత‌.. బ‌న్నీ తో చేసిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌న‌కు టాలీవుడ్ లో మ‌రి కొన్ని ఆఫ‌ర్స్ తేవ‌డానికి హెల్స్ అవుతుంద‌ని ఆశించింది . అయితే ఆ ..ఆశ అడియాసే అయిన‌ట్లు చెప్పుకుంటున్నారు ఆమె అభిమానులు. ఈ చిత్రంలో స‌మంత ను ఒక షుగ‌ర్ పేషెంట్ గా చూప‌డం ఆమె ఫ్యాన్స్ కే కాదు.. అభిమానులు కాని వారికి కూడా మింగుడు ప‌డటం లేదు.
మొత్తం మీద ఈ క్యూట్ బ్యూటీ ఇక కోలీవుడ్ నే న‌మ్ముకోవాలంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే తెలుగులో మ‌హేష్ బాబు, రాంచ‌ర‌ణ్ వంటి హీరోలు కొత్త వాళ్ల‌ను త‌మ స‌ర‌స‌న హీరోయిన్స్ గా తీసుకోవ‌డానికి మ‌క్కువ చూపుతున్నారు. ఇక యంగ్ టైగ‌ర్ స‌ర‌స‌న చేసిన రెండు చిత్రాల్లు స‌మంత‌కు క‌ల‌సి రాలేదు. దీంతో ఎన్టీఆర్ ప్ర‌స్తుతం సుకుమార్ తో చేస్తున్న సినిమాకు ర‌కుల్ ప్రీతిసింగ్ ను సెలెక్ట్ చేసుకున్నారు. సో బ‌న్నీ తో రిజ‌ల్ట్ ఏమిటి అనేది తెలిసిపోయింది. మ‌రి ఇటువంటి ప‌రిస్థితుల్లో స‌మంత‌కు కోలీవుడ్ మాత్రమే ఆశ .
First Published:  10 April 2015 10:17 PM GMT
Next Story