దీపిక ప‌దుకోనే..ఒక పాట‌..12 రాత్రులు..

ఒక పాట‌ను పిక్చ‌రైజ్ చేయ‌డానికి మ‌హా అయితే ఒక‌వారం రోజులు ఎక్కువ( ఒకే లోకేష‌న్ లో) . కానీ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత సంజ‌య్ లీలా భ‌న్సాలీ మాత్రం ఏకంగా 12 రోజులు ప్లాన్ చేస్తున్నారు. ఆయ‌న ఎంతో ప్ర‌తిష్టాత్న‌కంగా చేస్తున్న “బాజీరావు మ‌స్తానీ” చిత్రంలో దీపిక ప‌దుకోనే మ‌స్తానీ’గా న‌టిస్తుంది. బాజీరావు రోల్ ను దీపిక క్లోజ్ ఫ్రెండ్ ర‌ణ్వీర్ సింగ్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఒక సాంగ్ ను ఎంతో వ‌ర్ణ‌మ‌యంగా చేయ‌డానికి భ‌న్సాలీ డిసైడ్ అయ్యాడు. క‌థ‌క్ నృత్య శైలిలో సాగే ఈ పాట‌కు క‌థ‌క్ గురు బిజ్రూ మ‌హ‌రాజ్ కొరియోగ్ర‌ఫి చేయ‌నున్నారు.

గ‌త యేడాది దీపిక‌, ర‌ణ్వీర్ సింగ్ లతో రామ్ లీలా చిత్రం చేసిన సంజయ్ లీలా భ‌న్సాలీ.. వెంట‌నే మ‌రో చిత్రం వారిద్ద‌రితోనే చేస్తుండ‌టంతో.. అభిమానుల్లో అంచ‌నాలు ఒక రేంజ్ లో పెరిగాయి. చారిత్రిక చిత్రంగా ఉండిపోయే చిత్రంగా బాజీరావు మ‌స్తానీ’ ని.. ఒక ప్రేమ క‌థ‌గా చేస్తున్నారు. మొత్తం మీద ఆఫ్ లైన్ లో ప్రేమికులుగా పేరున్న దీపిక‌, ర‌ణ్వీర్ ల జోడి ఈసారి స్క్రీన్ పై మ‌రెంత కెమిస్ట్రి పండిస్తారో చూడాలి మరి.!