నిద్ర‌లోనే గాల్లో క‌లిసిపోయిన‌ 20 ప్రాణాలు

నిద్రపోతున్న 20 మందిని అన్యాయంగా కాల్చి చంపేశారు. ఈ దారుణమైన ఘటన పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లోని టుర్బట్ నగరంలో  జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు అందిన స‌మాచారం ప్రకారం టుర్బట్ నగర శివారులోని స్థానికంగా బ్రిడ్జి నిర్మాణం కోసం వచ్చిన కొంతమంది కార్మికులు త‌ల‌దాచుకుంటున్నారు. అయితే ఈ కార్మికులపై ఓ ఆగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 20 మంది కార్మికులు అక్క‌డిక‌క్క‌డే మరణించగా, ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కార్మికుల శరీరాల్లోకి విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌ర‌ప‌డం వ‌ల్ల మృతదేహాలు గుర్తు పట్టలేకుండా ఉన్నాయని, ఇది తీవ్రవాదుల చర్యగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. -పీఆర్‌