Telugu Global
Cinema & Entertainment

మరోసారి తెలుగుతెరపై కన్నేసింది

ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది ఇలియానా. ఆమె అడుగు పెడితే సినిమా హిట్టనే గోల్డెన్ హ్యాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కానీ తర్వాత మాత్రం ఆమె లక్ పని చేయలేదు. సిల్వర్ స్క్రీన్ పై వరుసగా పరాజయాలు పలకరించాయి. అదే టైమ్ లో బాలీవుడ్ బాట పట్టింది ఈ గోవా గుర్రం. కానీ అక్కడ కూడా యావరేజ్ హీరోయిన్ అనిపించుకుంది. అవకాశాలు కూడా రానురాను తగ్గుతూ వస్తున్నాయి. ఈ దశలో మరోసారి సౌత్ […]

మరోసారి తెలుగుతెరపై కన్నేసింది
X

ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది ఇలియానా. ఆమె అడుగు పెడితే సినిమా హిట్టనే గోల్డెన్ హ్యాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కానీ తర్వాత మాత్రం ఆమె లక్ పని చేయలేదు. సిల్వర్ స్క్రీన్ పై వరుసగా పరాజయాలు పలకరించాయి. అదే టైమ్ లో బాలీవుడ్ బాట పట్టింది ఈ గోవా గుర్రం. కానీ అక్కడ కూడా యావరేజ్ హీరోయిన్ అనిపించుకుంది. అవకాశాలు కూడా రానురాను తగ్గుతూ వస్తున్నాయి. ఈ దశలో మరోసారి సౌత్ పై కన్నేసింది ఇలియానా. కుదిరితే తెలుగు లేదా తమిళ్ లో ఓ సినిమాకు కాల్షీట్లు ఇవ్వాలని అనుకుంటోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్టీఆర్ సరసన ఇలియానా నటించే అవకాశముంది.

తమిళ్ లో హిట్టయిన కత్తి సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా తమిళనాట ఘనవిజయం సాధించింది. ఈ సినిమాని ఎన్టీఆర్ హీరోగా తెలుగులో తీయాలనుకుంటున్నాడు మురుగదాస్. ఈ సినిమాతోనే మరోసారి ఇలియానాను తెలుగుతెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఎన్టీఆర్-ఇలియానా కాంబినేషన్ లో రాఖీ, శక్తి సినిమాలొచ్చాయి. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి వర్కవుట్ అయితే హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధమైనట్టే.

First Published:  11 April 2015 9:45 PM GMT
Next Story