హీరో, హీరోయిన్ ఒకే ఇంట్లో..!

Ok Bangaaram

ద‌ర్శ‌క దిగ్గ‌జం మ‌ణిర‌త్నం కెరీర్ ప‌రంగా కొంత ట‌ఫ్ టైమ్ ను ఫేస్ చేస్తున్నారు. గ‌తంలో చేసిన రావ‌న్, ఆ త‌ర‌వాత చేసిన క‌డ‌లి చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గర బోల్తాపడటంతో, ఇప్పుడు బ‌య్య‌ర్లు మ‌ణిర‌త్నం సినిమా అంటే త‌మిళ‌నాట కొన‌డానికి వెన‌కంజ వేస్తున్నారు. క‌డ‌లి చిత్రం భారీ ధ‌ర‌లు చెల్లించి కొన‌గోలు చేసిన‌ బ‌య్య‌ర్లకు భారీ న‌ష్టాలు మిగిల్చిన విష‌యం తెలిసిందే.

క‌ట్ చేస్తే తాజాగా నిత్యామీన‌న్, దుల్క‌ర్ స‌ల్మాన్ లీడ్ రోల్స్ లో ఓకే బంగారం పేరు తో ఒక చిత్రం చేశారు. ఈ సినిమాను తెలుగులోనూ ఓకే బంగారం పేరుతో రిలీజ్ కు సిద్దం చేశారు. తెలుగులో మెగా ప్రొడ్యూస‌ర్ దిల్ రాజ్ రిలీజ్ చేయనున్నారు. ఒకే బంగారం ప్ర‌చార చిత్రాలు సినిమా పై కొద్ది పాటి అంచ‌నాలు పెంచాయి. ఈ సినిమాను ఈ నెల 17న తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్న‌ట్లు శుక్ర‌వారం మీడియాకు దిల్ రాజ్ తెలియా చేశారు.వృత్తి రిత్యా విదేశాల‌కు వెళ్లాల్సిన ఒక అబ్బాయి..అమ్మాయి ముంబాయిలో ఓకే ఇంట్లో వుండాల్సి వస్తుందట‌. ఆ క్ర‌మంలో చోటు చేసుకున్న ప‌రిణామాలే ఒకే బంగారం చిత్రం అంటున్నారు. 15 సంవ‌త్స‌రాల క్రితం వ‌చ్చిన స‌ఖి చిత్రం మాదిరి ఒకే బంగారం అభిమానుల్ని మెప్పిస్తుంద‌ని దిల్ రాజు భ‌రోసా ఇచ్చారు. ఈ చిత్రానికి సంగీతం ర‌హ‌మాన్ .. సినిమాటోగ్ర‌ఫి పి సి శ్రీ‌రామ్ అందించారు.