మ‌ల్లీ స్టార‌ర్ చిత్రం శ‌ర వేగంగా..!

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రంతో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌కు సీనియ‌ర్ హీరోలు ఆస‌క్తి చూపిస్తున్నారు.ఈ కోవలోనే హీరో నాగార్జున‌,
త‌మిళ స్టార్ హీరో కార్తీలు ఒక చిత్రం చేస్తున్నారు. ఎవడు చిత్రం త‌రువాత డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌ర‌గుతుంది.పీవిపి బ్యాన‌ర్ లో ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీ స‌ర‌స‌న త‌మ‌న్నా చేస్తుండ‌గా..నాగార్జునస‌ర‌స‌న లావ‌న్య త్రిపాఠి చేస్తున్నారు. వాణిజ్య విలువ‌ల‌తో జ‌న‌రంజ‌కంగా సినిమాను చేస్తున్న‌ట్లు డైరెక్ట‌ర్ తెలిపారు. జూన్ నెల ఆఖ‌రు లోపు షూటింగ్ పూర్తి చేసి ఆగ‌స్టులో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణ‌యించ‌లేదు.