మాంఛి కిక్కిచ్చే సినిమా

వరుస విజయాలతో దూసుకుపోతున్న మాస్ మహారాజ్ రవితేజ అప్పుడే మరో సినిమా రెడీ చేశాడు. అదే కిక్-2. గతంలో తనకు బ్రేక్ ఇచ్చిన కిక్ సినిమాకు సీక్వెల్ గా కిక్-2 మూవీని తెరకెక్కించాడు రవితేజ. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. తాజాగా తీసిన ఓ ఐటెంసాంగ్ తో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఎన్టీఆర్ నటించిన టెంపర్ లో ఐటెంసాంగ్ చేసిన నోరా రవితేజ కిక్-2లో కూడా మరో ఐటెంసాంగ్ చేసింది.
మరోవైపు కిక్-2 పోస్ట్ ప్రొడక్షన్లు పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. కల్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై  తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రవితేజ పోలీస్ ఆఫీసర్ అవ్వడంతో కిక్ సినిమా ముగుస్తుంది. సరిగ్గా అక్కడ్నుంచే కిక్-2 ప్రారంభం అవుతుందని సమాచారం. పోలీస్ అధికారి అయిన రవితేజ అవినీతిపరులతో ఎలా ఆడుకున్నాడనేదే కిక్-2 కాన్సెప్ట్.