మా ఎన్నిక‌ల‌పై 15న తీర్పు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ పై తుది తీర్పు ఈ నెల 15న వెల్ల‌డిస్తామ‌ని సిటీ సివ‌ల్ కోర్టు ప్ర‌క‌టించింది. ఈ ఎన్నిక‌ల‌లో సినీ ప‌రిశ్ర‌మ రెండుగా చీలిపోయి పోటీ చేసింది. ఒక ప్యాన‌ల్‌కు సినీ హీరోయిన్ జ‌య‌సుధ నేతృత్వం వ‌హిస్తుండ‌గా మ‌రో ప్యాన‌ల్‌కు సినీ హీరో రాజేంద్ర‌ప్రసాద్ సారథ్యం వ‌హిస్తున్నారు. ఎన్నిక‌లు ఆపాలంటూ ఓ వ‌ర్గం కోర్టుకెళ్ళ‌గా ఎన్నిక‌లు య‌థావిధిగా జ‌ర‌పాల‌ని, తీర్పు వ‌చ్చే వ‌ర‌కు ఫ‌లితాలు వెల్ల‌డించ‌వ‌ద్ద‌ని ఇంత‌కుముందు కోర్టు ప్ర‌క‌టించింది. ఈ కేసులో వాద‌న‌లు పూర్త‌య్యాయి. దీనిపై తీర్పు 15న వెల్ల‌డిస్తామ‌ని కోర్టు ప్ర‌క‌టించింది.-పీఆర్‌