Telugu Global
Others

నూతన రాజధాని చుట్టూ హైస్పీడ్ రైలు నిర్మాణం

నూతన రాజధాని చుట్టూ హైస్పీడ్ రైలు నిర్మాణం చేపట్టాలని మాస్టర్ ప్రణాళికను రూపొందిస్తున్న సింగపూర్ కంపెనీల ప్రతినిధి బృందం ప్రభుత్వానికి సూచించింది. నూతన రాజధాని మాస్టర్ ప్రణాళిక ఉద్దేశపత్రాన్ని రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఏ ప్రాంతంలో ఏ రంగాన్ని అభివృద్ధి చేయాలనే దాన్ని ఈ ప్రతంలో పొందుపరిచి ఇటీవల సింగపూర్ కంపెనీల ప్రతినిధి బృందం ఏపీ సీఎం చంద్రబాబుకు సమర్పించిందని తెలిసింది. అలాగే జూన్ తొలివారంలో నూతన రాజధాని మాస్టర్ ప్రణాళికను సమర్పించనున్నారు. నూతన రాజధానిలో గన్నవరం […]

నూతన రాజధాని చుట్టూ హైస్పీడ్ రైలు నిర్మాణం
X

నూతన రాజధాని చుట్టూ హైస్పీడ్ రైలు నిర్మాణం చేపట్టాలని మాస్టర్ ప్రణాళికను రూపొందిస్తున్న సింగపూర్ కంపెనీల ప్రతినిధి బృందం ప్రభుత్వానికి సూచించింది. నూతన రాజధాని మాస్టర్ ప్రణాళిక ఉద్దేశపత్రాన్ని రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఏ ప్రాంతంలో ఏ రంగాన్ని అభివృద్ధి చేయాలనే దాన్ని ఈ ప్రతంలో పొందుపరిచి ఇటీవల సింగపూర్ కంపెనీల ప్రతినిధి బృందం ఏపీ సీఎం చంద్రబాబుకు సమర్పించిందని తెలిసింది. అలాగే జూన్ తొలివారంలో నూతన రాజధాని మాస్టర్ ప్రణాళికను సమర్పించనున్నారు. నూతన రాజధానిలో గన్నవరం వైపు ఎయిర్ సిటీని అభివృద్ధి చేయాలని సింగపూర్ ప్రతినిధులు రూపొందించిన సదరు పత్రంలో ప్రతినిధులు సూచించారు. గన్నవరాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలని, తెనాలి వైపు కల్చర్ రంగాన్ని అభివృద్ధి చేయాలని, అమరావతి వైపు పర్యాటక రంగం అభివృద్ధికి పలు ప్రాజెక్ట్ లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

నూజివీడు వైపు పలు రకాల ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. మచిలీపట్నం వైపు ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల ప్రాజెక్ట్ లను అభివృద్ధి చేయాలని సూచించారు అలాగే విశాఖపట్నం నుంచి చెన్నై మధ్య హైస్పీడ్ రైలు నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. కాగా, కొత్త రాజధానిలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి భూముల కేటాయింపునకు ప్రభుత్వం వద్ద రెండే మార్గాలున్నాయని, ఉత్పత్తి రంగ పరిశ్రమల ఏర్పాటుకు ఎకరం కోటి రూపాయల చొప్పున కేటాయింపు లేదా వేలంపాట ద్వారా కేటాయింపుపై పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఐటీ సంబంధిత పరిశ్రమలకు ఎకరం రూ.50 లక్షల చొప్పున కేటాయింపు, లేదా వేలం వేయడం అనే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వేలంపాట ద్వారా కాదనుకుంటే ఏ రంగాల పరిశ్రమల స్థాపనకు ఎంత ధరకు భూములు కేటాయించాలనే విషయమై ప్రభుత్వం విధానాన్ని రూపొందించాల్సి ఉంది.

First Published:  13 April 2015 3:17 AM GMT
Next Story