Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 46

కావాల్సినన్ని! భార్య భర్తలు హాలిడే రిసార్ట్‌కు వెళ్ళి ‘రాత్రికి ఉండడానికి రూములు ఉన్నాయా?’ అని అడిగారు. అక్కడి సూపర్‌వైజర్‌ ‘కావాల్సినన్ని ఉన్నాయి’ అన్నాడు. ‘భోజన సదుపాయలు?’ ‘కావాల్సినన్ని ఉన్నాయి’ ‘ట్రాన్స్‌పోర్ట్‌ సదుపాయాలు?’ ‘కావాల్సినన్ని ఉన్నాయి’ ‘దోమలు’ ‘కావాల్సినన్ని ఉన్నాయి..!!!’ ************ రైటర్స్‌ వార్‌ ఒకరంటే ఒకరికి పడని ఇద్దరు రచయితలు కలుసుకున్నారు. మొదటి రచయిత ‘నీ పుస్తకం చదివాను. అది చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎవరి దగ్గర రాయించావు?’ అన్నాడు. రెండో రచయిత ‘నీ మాటలు విని […]

కావాల్సినన్ని!

భార్య భర్తలు హాలిడే రిసార్ట్‌కు వెళ్ళి ‘రాత్రికి ఉండడానికి రూములు ఉన్నాయా?’ అని అడిగారు.
అక్కడి సూపర్‌వైజర్‌ ‘కావాల్సినన్ని ఉన్నాయి’ అన్నాడు.
‘భోజన సదుపాయలు?’
‘కావాల్సినన్ని ఉన్నాయి’
‘ట్రాన్స్‌పోర్ట్‌ సదుపాయాలు?’
‘కావాల్సినన్ని ఉన్నాయి’
‘దోమలు’
‘కావాల్సినన్ని ఉన్నాయి..!!!’

************

రైటర్స్‌ వార్‌

ఒకరంటే ఒకరికి పడని ఇద్దరు రచయితలు కలుసుకున్నారు.
మొదటి రచయిత ‘నీ పుస్తకం చదివాను. అది చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎవరి దగ్గర రాయించావు?’ అన్నాడు.
రెండో రచయిత ‘నీ మాటలు విని చాలా సంతోషం కలిగింది. ఇంతకూ నీకోసం ఆ పుస్తకాన్ని ఎవరు చదివిపెట్టారు?’ అన్నాడు.

************

మక్కీకి మక్కీ

తన కొడుకు ఇంగ్లీష్‌ టెస్టులో ఎలా పాసవుతాడో అని తండ్రికి బెంగ పట్టుకుంది. లెటర్‌ రైటింగ్‌లో ‘మై బెస్ట్‌ ఫ్రెండ్‌’కి సంబంధించి ఒక ఉత్తరం రాయమని సాధారణంగా ఇస్తూ ఉంటారు. అది ఊహించి అలాంటి లెటర్‌ ఒకటి రాయడం ప్రాక్టీస్‌ చేయించాడు తండ్రి. కానీ పరీక్షలో ఫ్రెండ్‌కు బదులు ‘తండ్రి’ గురించి ఉత్తరం రాయమని వచ్చింది. ఆ అబ్బాయి తనకు గుర్తున్నవన్నీ కలిపి ఉత్తరం రాశాడు. ఫ్రెండ్‌ స్థానంలో ‘తండ్రి’ వచ్చాడు. నాకు చాలామంది నాన్నలున్నారు. వాళ్లందర్లో నాకు బాగా ఇష్టమయిన నాన్న మా పక్కింట్లోనే ఉంటారు. ప్రతిరోజూ మా ఇంటికి వస్తారు. మా అమ్మకు ఆ నాన్న చాలా ఇష్టం. ఎ ఫాదర్‌ ఇన్‌ నీడ్‌ ఈజ్‌ ఎ ఫాదర్‌ ఇన్‌ డీడ్‌’ అని రాశాడు.

***********

పోలీసు కుక్క

ఒక పోలీసును కుక్క కరిచింది. అతను డాక్టర్‌ దగ్గరకు వచ్చాడు. డాక్టర్‌ ‘ఇది ఎలా జరిగింది’ అన్నాడు. ‘నిజం చెప్పాలంటే అప్పుడు నేను యూనిఫాంలో లేను’ అన్నాడు పోలీసు.

First Published:  12 April 2015 7:00 PM GMT
Next Story