వ‌ర్మ దృష్టి వీరప్పన్ను చంపిన వ్య‌క్తి మీద ప‌డింది..! 

వ‌ర్మ ఆలోచ‌న‌ల పుట్ట‌. ఆయ‌న రోజ‌కు ప‌ది ఆలోచ‌న‌లు చెప్ప‌గ‌ల‌డు. ఇంప్లిమెంట్ చేస్తాడా లేదా అనేది సెకండ‌రి. కానీ  ఆలోచ‌న‌ల ప్ర‌వాహం మాత్రం ఆగ‌దు. ఈ మ‌ధ్య‌నే ఒక సైలెంట్ మూవీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన వ‌ర్మ‌.. తాజాగా  గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ ను చంపిన వ్య‌క్తి ఆధారంగా సినిమా చేయాడానికి కావాల‌సిన మెటిరియ‌ల్ దొరికిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఆంధ్ర‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన  వీర‌ప్పన్ను ప‌ట్టుకోవ‌డానికి  దాదాపు 600 కోట్ల రూపాయలు, ఈ మూడు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఖ‌ర్చు చేశాయనేది అప్ప‌ట్లో వినిపించిన మాట‌.  క‌ట్ చేస్తే ఇటువంటి వ్యక్తిని ఒకే ఒక్క‌డు హ‌త‌మార్చాడు.
 
అత‌ని జీవితం ఆధారంగానే సినిమా చేస్తున్నాడ‌ట‌.  అయితే ఈ చిత్రంలో క‌న్న‌డ లెజండ్రీ యాక్ట‌ర్  రాజ‌కుమార్ త‌న‌యుడు శివ‌రాజ్ కుమార్ హీరోగా చేస్తార‌ని చెప్పారు.  రియ‌ల్ లైఫ్ లో  వీర‌ప్పన్ను  సినిమాటిక్ గా  క‌న్న‌డ లెజండ్రి యాక్ట‌ర్  రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసి దాదాపు మూడు నెలల పాలు బంధీగా వుంచిన విష‌యం తెలిసిందే. చివ‌ర‌కు అయ‌న త‌న‌యుడే  వీర‌ప్ప‌ను ను చంపిన‌ట్లు సినిమా తెర‌కెక్కుతుండ‌టం విశేషం . మొత్తం మీద వీర‌ప్ప‌న్ మీద సినిమా చేయాలనుకుంటున్న రామ్ గోపాల్ వ‌ర్మ కు ఇంత కాలానికి మంచి  టైమ్ .. క‌థ దొరికింద‌ట మ‌రి.!   వ‌ర్మ అనుకోవాలి కానీ..  చేయ‌కుండ వుంటాడా..?