శృతిహాసన్, హన్సికతో పాటు అంజలి

            తమిళలో హీరో విజయ్ ప్రస్తుతం పులి అనే సినిమా చేస్తున్నాడు. సోసియో ఫాంటసీ కథాశంతో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఉన్నారు. శృతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీళ్లిద్దరు కాకుండా అతిలోకసుందరి శ్రీదేవి కూడా పులిలో నటిస్తోంది. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత పులితో ఆమె తమిళనాట రీఎంట్రీ ఇస్తోంది. దీంతో విజయ్ చేస్తున్న పులి సినిమా కోలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది. ఇప్పుడు దీనికి అంజలి రూపంలో మరో ఎట్రాక్షన్ కూడా జతగా చేరింది. 
          తమిళనాట అంజలికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె నటించిన కొన్ని సినిమాలు అక్కడ విజయవంతమయ్యాయి. అయితే కోలీవుడ్ లో సోలో హీరోయిన్ ఛాన్సులు మాత్రం ఆమెకి రావట్లేదు. ఈమధ్యే సూర్య సినిమాతో ఐటెంభామగా కూడా మారింది. ఈ నేపథ్యంలో విజయ్ సినిమాలో ఓ కీలకపాత్రకు అంజలి ఎంపికవ్వడంతో, ఆమె మళ్లీ లైమ్ లైట్ లోకివస్తుందని అంతా భావిస్తున్నారు.