ముంబైలో రెడ్ అల‌ర్ట్‌!

బొంబాయి త‌ర‌హా దాడుల‌కు తీవ్ర‌వాదులు కుట్ర ప‌న్నిన‌ట్టు ఇంటిలిజెన్స్ నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. గ‌త వారం రోజుల నుంచి జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌పై నిఘాను ప‌టిష్టం చేశాయి. దీంతో అనేక విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ల‌ష్క‌రే తోయిబా దాడుల‌కు ప్ర‌ణాళిక ర‌చించింద‌న్న స‌మాచారం తెలియ‌డంతో కేంద్రాన్ని హెచ్చ‌రించింది. దీంతో హోం శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. స‌ముద్ర మార్గాల ద్వారా టెర్ర‌రిస్టులు భార‌త్‌లోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని ఐ.బి. తెలిపింది. దీంతో పోలీసులు ముంబాయిలోని రైల్వే స్టేష‌న్ల‌లోను, ఎయిర్ పోర్ట‌ల్లోను, ముఖ్య‌మైన హోట‌ళ్ళ వ‌ద్ద నిఘాను ప‌టిష్టం చేసి భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టారు. వి.వి.ఐ.పి.లు, వి.ఐ.పి.లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హోం శాఖ సూచించింది.-పీఆర్‌