హ్యాక‌ర్ల బారిన ప‌డిన మ‌రో న‌టి..!

టెక్నాల‌జీ  ఉప‌యోగం ఎలా వున్న సెలిబ్రిటీల పాలిటి  శాపంగా మారుతుంది. ముఖ్యంగా  హీరోయిన్స్ కు  ఈ టెక్నాల‌జీ తో  పెద్ద త‌లనొప్పులే వ‌స్తున్నాయి.   మ‌న సౌత్ లో త్రిష‌, హ‌న్సిక‌, నమిత వంటి హీరోయిన్స్   మార్ఫింగ్ భూతానికి బ‌లైన వారే.  ఇక హాలీవుడ్ లో  అయితే ఈ పోక‌డ మ‌రీ ఎక్కువుగా ఉంది. తారాల వ్య‌క్తి గ‌త వివ‌రాల్ని కూడా వ‌ద‌ల‌కుండ త‌స్క‌రించి..  ఆన్ లైన్ లో  పెడుతున్నారు. తాజాగా హాలీవుడ్ న‌టి కెల్లీ బ్రూక్  హ్యాక‌ర్ల బారిన ప‌డింది. ఫిరాన 3డి, చిత్రంలో న‌టించిన ఈ ముద్దుగుమ్మ  ప‌ర్స‌న‌ల్ స‌మాచారాన్ని అంతా  హ్య‌క‌ర్లు త‌స్క‌రించి ఆన్ లైన్ లో పెట్ట‌డం సంచ‌ల‌నం అయ్యింది. వాటిలో కొన్ని త‌న మాజి ప్రియుడు  డేవిడ్ మెకింటోష్ తో  అత్యంత స‌న్నిహితంగా  ఉన్న‌ప్పుడు  తీసిని న‌గ్న చిత్రాలు ఉండ‌టం గ‌మ‌నార్హాం. బ్రూక్ కు ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎదురు కావ‌డం  ఇది కొత్త కాదు.  గ‌త ఏడాది కూడా త‌న ఫోటోలు హ్యాక‌ర్ల చేతిలో ప‌డి ఆల్లైన్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి.