మ‌హేష్ బాబు మలేషియాలో బిజీ బిజీ..!

స‌కుటుంబంగా సినిమా చూడాల‌నుకునే హీరోల్లో మ‌హేష్ బాబు ఒక‌రు. ఆయ‌న చిత్రాలంటే ఫ్యామిలీ అంద‌రు క‌ద‌లుతారు. ప్ర‌స్తుతం మిర్చి ఫేమ్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ చేస్తున్న శ్రీ‌మంతుడు చిత్రం స‌కుటుంబ స‌ప‌రివారంగా చూడ‌త‌గ్గ చిత్రంగా ఉంటుంద‌ని టాక్. మ‌హేష్ బాబు సర‌స‌న తొలిసారి శృతిహాస‌న్ పూర్తి స్థాయిలో హీరోయిన్ గా చేస్తున్న చిత్రమిది . ఈ నెల 22 వ‌ర‌కు మ‌హేష్ బాబు, శృతిహాస‌న్, జ‌గ‌పతి బాబు ల‌పై కొన్ని
కీల‌క స‌న్నివేశాలు షూట్ చేస్తారు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్ర‌సాద్ స‌ర‌స‌న పెద్ద‌రికం ఫేమ్ సుకన్య న‌టిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.రాహుల్ ర‌వింద్ర‌న్ కూడా ఒక కీ రోల్ చేస్తుండ‌గా , సంప‌త్ రాజ్, ఆమ‌ని కీ రోల్స్ చేస్తున్నారు. టోట‌ల్ గా మంచి ఫ్యామిలీ ప్యాక్ సిద్దం అవుతుంది. ఈ సినిమాకు శ్రీ‌మంతుడు అనే వ‌ర్కింగ్ టైటిల్ వినిపిస్తుంది.