మరో డేరింగ్ డెసిషన్

               సినిమాల పరంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా కీలకమైన విషయం. చిన్నతప్పుచేసినా కెరీర్ అట్టడుక్కి చేరుకుంటుంది. ఈ విషయంలో నిత్యామీనన్ మాత్రం చాలా గ్రేట్. ప్రయోగాత్మాక చిత్రాలు చేయడం, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో నిత్యామీనన్ ను మించిన హీరోయిన్ మరొకరు లేరనే విషయం ఆమె సినిమాలు చూస్తేనే అర్థమైపోతుంది. అయితే ఇన్నాళ్లూ హీరోయిన్ గానే కొనసాగిన ఈ మలయాళీ బ్యూటీ ఇప్పుడో డేరింగ్ డెసిషన్ తీసుకుంది. ఓ స్టార్ హీరో పక్కన చెల్లెలి పాత్ర చేయడానికి ఒప్పుకుంది. 
                 కథ బాగుంటే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమని హీరోయిన్లు ప్రకటిస్తుంటారు. కానీ నిత్యామీనన్ మాత్రం దాన్ని అమలుచేసి చూపిస్తోంది. కథ నచ్చింది కాబట్టి ఏకంగా హీరోకి చెల్లెలుగా చేయడానికి కూడా ఒప్పుకుంది. తమిళ్ లో అజిత్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ కు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే ఆ మూవీలో అజిత్ కు సిస్టర్ గా నటించేందుకు రెడీ అయింది నిత్యామీనన్. ఈ సినిమాలో అజిత్ పక్కన చెల్లెలిగా కనిపిస్తే, భవిష్యత్ లో ఇక సూపర్ స్టార్ సరసన హీరోయిన్ ఛాన్స్ రాదనే విషయం తెలిసి కూడా నిత్యామీనన్ ఈ డేరింగ్ డెసిషన్ తీసుకుంది. రియల్లీ గ్రేట్.