పెళ్లి..ప్రేమ రెండూ వద్దు

         మొన్నటివరకు ప్రేమ ఎంత మధురం అని పాటలు పాడుకుంది. కానీ సరిగ్గా ఏడాది తిరిగేసరికి ప్రియుడు చాలా కఠినం అంటూ స్లోగన్లు అందుకుంది చుల్ బులీ సమంత. ప్రస్తుతానికైతే తనకు ప్రేమా..పెళ్లి రెండూ వద్దని అంటూనే, తన దృష్టంతా సినిమాలపైనే ఉందని ఓ రొటీన్ డైలాగ్ కూడా పడేసింది. సరిగ్గా ఏడాదిన్నర కిందట తను ప్రేమలో ఉన్న విషయాన్ని సమంతానే స్పష్టంగా చెప్పుకొచ్చింది. ఎవరిని లవ్ చేస్తున్న విషయాన్ని చెప్పకపోయినప్పటికీ.. లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నానని మాత్రం చెప్పుకొచ్చింది. తర్వాత సమంత ప్రేమిస్తోంది హీరో సిద్దార్థ్ నే అనే విషయాన్ని మీడియా కనుక్కుంది. అక్కడ్నుంచి కొన్ని సందర్భాల్లో సమంత-సిద్ధూ కలిసి పబ్లిక్ ఫంక్షన్లకు హాజరవ్వడం మొదలుపెట్టారు. కానీ ఈమధ్య కాలంలో ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగిందని మరోసారి పుకార్లు రావడం మొదలయ్యాయి. 
                      సమంత-సిద్దార్థ్ కు బాగా చెడిందనే ప్రచారం గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. ఈ విషయాన్ని అటు సమంత కానీ, ఇటు సిద్దార్థ్ కానీ ఎప్పుడూ ప్రస్తావించలేదు. కానీ తాజాగా సమంత ఇచ్చిన ప్రకటనతో వాళ్లిద్దరూ విడిపోయారనే విషయం స్పష్టమైంది. నిజంగా సిద్ధూతో ప్రేమలో ఉంటే.. తనకు ప్రేమ-పెళ్లి వద్దనే మాటల్ని సమంత అనదు కదా. పైగా ఎవరో బిజినెస్ మేన్ తో లవ్ లో ఉందనే రూమర్లు కూడా కొత్తగా ఊపందుకోవడంతో.. సమంత ఇలా స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ ఒక్క స్టేట్ మెంట్ తో సిద్ధూ-సమంత విడిపోయారనే విషయం కన్ ఫర్మ్ అయింది.