సూర్యతో ప్రియాంకచోప్రా

         త్వరలోనే ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటించడానికి పావులు కదుపుతున్నాడు హీరో సూర్య. ఇప్పటికే దీనికి సంబంధించి నిర్మాత నందితా సింఘాతో చేతులు కలిపాడు. తన కూడా సహనిర్మాతగా వ్యవహరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో ప్రియాంకచోప్రాను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు సూర్య. ఎందుకంటే.. తెలుగు-తమిళ-హిందీ భాషల్లో ఒకేసారి భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నాడు కాబట్టి.. ప్రియాంకచోప్రా అయితే సూటవుతుందని భావిస్తున్నాడు సూర్య. తెలుగు ఆడియన్స్ కు కూడా తుఫాన్ తో ప్రియాంకచోప్రా పరిచయమైంది కాబట్టి ఆమెను ఫిక్స్ చేశాడు. ఇప్పటికే ప్రియాంకకు టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చాడని సమాచారం. మురుగదాస్ దర్శకత్వంలో ఈ త్రిభాషా చిత్రం చేసే ఆలోచనలో ఉన్నాడు సూర్య. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 150 కోట్లు ఉండబోతోందని ఓ అంచనా.