Telugu Global
National

ఒకే పార్టీగా జ‌న‌తా ప‌రివార్

భార‌తీయ జ‌న‌తాపార్టీ, కాంగ్రెస్ పార్టీల‌కు ధీటుగా త‌యార‌య్యేందుకు ఆరు పార్టీల‌తో కూడిన జ‌న‌తాద‌ళ్ ప‌రివార్ ఒక్క‌ట‌య్యాయి. ఈ పార్టీల‌న్నీ ఇక విలీన‌మ‌వుతున్నాయి. బుధ‌వారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు సుదీర్ఘంగా చ‌ర్చించిన ఎస్పీ, ఆర్జేడీ, జేడీయు, జెడీఎస్‌, ఐఎన్ఎల్‌డీ, ఎస్‌జేపీల అధ్య‌క్షులు తామంతా ఏక‌మై కాంగ్రెస్‌, బీజేపీల‌కు ధీటుగా ఉండాల‌ని నిర్ణ‌యించారు. కొత్త పార్టీగా ఈ ఆరు పార్టీలు రూపాంత‌రం చెందుతాయి. కొత్త పార్టీకి ఏం పేరు పెట్టాలి? జెండా ఎలాగుండాలి? ఎజెండా ఏమిటి?… అనే విష‌యాల‌ను […]

ఒకే పార్టీగా జ‌న‌తా ప‌రివార్
X

భార‌తీయ జ‌న‌తాపార్టీ, కాంగ్రెస్ పార్టీల‌కు ధీటుగా త‌యార‌య్యేందుకు ఆరు పార్టీల‌తో కూడిన జ‌న‌తాద‌ళ్ ప‌రివార్ ఒక్క‌ట‌య్యాయి. ఈ పార్టీల‌న్నీ ఇక విలీన‌మ‌వుతున్నాయి. బుధ‌వారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు సుదీర్ఘంగా చ‌ర్చించిన ఎస్పీ, ఆర్జేడీ, జేడీయు, జెడీఎస్‌, ఐఎన్ఎల్‌డీ, ఎస్‌జేపీల అధ్య‌క్షులు తామంతా ఏక‌మై కాంగ్రెస్‌, బీజేపీల‌కు ధీటుగా ఉండాల‌ని నిర్ణ‌యించారు. కొత్త పార్టీగా ఈ ఆరు పార్టీలు రూపాంత‌రం చెందుతాయి. కొత్త పార్టీకి ఏం పేరు పెట్టాలి? జెండా ఎలాగుండాలి? ఎజెండా ఏమిటి?… అనే విష‌యాల‌ను ఖ‌రారు చేయ‌డానికి ఐదుగురు స‌భ్యుల‌తో ఓ క‌మిటీని వేశారు. కొత్త పార్టీకి అధ్యక్షుడిగా స‌మాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్ ఉంటారు. ప్ర‌స్తుతం ఆరు పార్టీల విలీన‌మైన నేప‌థ్యంలో ఈ అన్ని పార్టీల‌కు పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా కూడా ములాయంసింగే వ్య‌వ‌హ‌రించాల‌ని జ‌న‌తా ప‌రివార్ స‌మావేశం నిర్ణ‌యించింది. ఇక నుంచి ఈ పార్టీల‌న్నీ ఒకే గుర్తుపై పోటీ చేస్తాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు శ‌త్రువులుగా ఉన్న వీరంతా ఒకే గూటికి రావ‌డానికి సుదీర్ఘ మంత‌నాలే జ‌రిగాయి. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు చ‌ర్చోప‌చర్చ‌లు జ‌రిపి చివ‌రికి అంతా క‌లిసి ఒకే పార్టీగా ఉండాల‌ని భాగ‌స్వామ్య పార్టీలు అంగీక‌రించాయి. ఈ జ‌న‌తా ప‌రివార్ స‌మావేశంలో ములాయంసింగ్ యాద‌వ్‌, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌, శ‌ర‌ద్ యాద‌వ్‌, దేవెగౌడ‌, చౌతాల త‌దిత‌రులు పాల్గొన్నారు. మ‌త‌తత్వ శ‌క్తుల‌ను ఓడించే లక్ష్యంతోనే త‌మ పార్టీల‌ విలీనం జ‌రిగింద‌ని లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ అన్నారు.-పీఆర్‌

First Published:  15 April 2015 6:48 AM GMT
Next Story